40.2 C
Hyderabad
May 5, 2024 16: 55 PM
Slider ప్రత్యేకం

తాజాగా ఫోన్ కాల్ లో దొరికిపోయిన ఏపి మంత్రి

#ministergummanurujayaram

ఎక్కడికక్కడ ప్రయివేటు రాజ్యం నడుపుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులు యథేచ్ఛగా దోచుకుతింటున్నారు. అడ్డువచ్చిన వారికి వార్నింగ్ లు ఇస్తున్నారు. ఇదీ ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దందా. అదేమిటో విచిత్రంగా అమ్మాయిలతో బేరాలాడుకునే వైసీపీ నాయకుల నుంచి ఇలా దందాలు చేస్తున్న వారి వరకూ అందరూ ఆడియో కాల్స్ లో దొరికిపోతున్నారు.

తాజాగా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సన్నిహితుడు జయరామిరెడ్డి ఓ కాంట్రాక్టర్ ని బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నది. కనేకల్ నుండి నల్లంపల్లి వరకు చేపట్టిన రోడ్డు పనులను ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా మొదలు పెడతారని, ఎమ్మెల్యే ను కలిసిన తర్వాతనే పనులు చేయాలని బెదిరింపులకు దిగినట్లుగా ఆ వీడియో ద్వారా అర్థమవుతుంది.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో వైసీపీ నాయకుడు జయరామిరెడ్డి ఉదంతం కూడా ఏపీలో హాట్ టాపిక్ అయింది. వైసీపీ నాయకుడు జయరామిరెడ్డి, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డికి ప్రధాన అనుచరుడు. ఆయన ఓ రోడ్డు కాంట్రాక్టర్ ను ఎమ్మెల్యేకు కలవకుండా పనులు చెయ్యకూడదని బెదిరింపులకు పాల్పడ్డారు. రహదారి పనులు నిలిపివేయాలని హెచ్చరించారు. పనులు ఆపకపోతే భౌతిక దాడులకు దిగుతామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఈ బెదిరింపు ఉదంతాలను అవకాశంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ వైసీపీ నాయకుల పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా యదేచ్ఛగా సాగుతోందని, ఇసుక అక్రమ రవాణా వెనుక వైసీపీ నేతల హస్తం ఉందని చాలా కాలం నుండి తెలుగుదేశం పార్టీ నేతలు వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ పార్టీ నేతలే శాండ్ మాఫియాగా మారి దందాలు చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇక తాజాగా ఇసుక అక్రమ రవాణాపై స్థానిక ఎస్ఐ ని మంత్రి జయరాం బెదిరింపు సంభాషణ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇసుక అక్రమ రవాణాపై ఓ పోలీసు అధికారితో మంత్రి జయరాం జరిపిన సంభాషణ ఇప్పుడు రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది.

మంత్రి గుమ్మనూరు జయరాం ఆలూరు నియోజకవర్గంలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎస్సైతో సంభాషించారు. ఖాళీ ఇసుక ట్రాక్టర్ లను పట్టుకున్నారని, నలభై మంది తన దగ్గరకు వచ్చారని ఎస్సైతో మాట్లాడిన మంత్రి జయరాం పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను వదిలేయాలని ఎస్ఐ హుకుం జారీ చేశారు. అయితే ఎస్ఐ ఇసుక అక్రమ తవ్వకాలు చెయ్యొద్దని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. నిబంధనల ప్రకారం ఇసుక తవ్వుకోవాలని ఆయన సూచించారు. ఇల్లీగల్ గా ఇసుక రవాణా చేయొద్దని, లీగల్ గా ఇసుక తీసుకెళ్లడంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వారికి చెప్పినట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు.

Related posts

పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

Bhavani

ఫస్ట్ పెరేడ్: పల్లె ప్రగతి స్ఫూర్తితో మరింత ముందుకు

Satyam NEWS

కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలు మరువలేనివి

Satyam NEWS

Leave a Comment