41.2 C
Hyderabad
May 4, 2024 17: 48 PM
Slider గుంటూరు

సొంత గ్రామంలో విలేజ్ క్లీనిక్ పెట్టలేని ఆరోగ్య మంత్రి

#vidadalarajani

రాష్ట్రం మొత్తం హెల్త్ క్లీనిక్ లు పెడతామని, ఫ్యామిలీ డాక్టర్ ను పెడతామని చెబుతున్న ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ ఇలాకాలో ఇప్పటి వరకూ విలేజ్ క్లీనిక్ కూడా పూర్తి కాలేదని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామంలో ప్రజలు ఆసుపత్రి లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఆరోగ్య శాఖ మంత్రి స్వంత నియోజకవర్గ పరిధిలో ఉన్న ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామస్థులు ఆహ్వానం మేరకు ఆయన విలేజ్ క్లినిక్ ప్రారంభించడానికి ఏర్పాటు చేసిన స్థలాన్ని పరిశీలించారు.17 లక్షల అంచనా తో ప్రారంభించిన ఆసుపత్రి నిర్మాణం నీటితో నిండిపోయింది.

ఎప్పుడు పనులు పూర్తి చేస్తారో తెలియడం లేదంటూ గ్రామస్థులు రావు సుబ్రహ్మణ్యం దృష్టికి తీసుకువచ్చారు. మంత్రి, కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని రావు సుబ్రహ్మణ్యం విజ్ఞప్తి చేశారు. అత్యవసర పరిస్థితుల్లో చిలకలూరిపేట, గుంటూరు కు వైద్యం కోసం తప్పనిసరిగా వెళ్లే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఉన్నవ గ్రామస్థులు గల్లా గోపి, ఉన్నవ గోపి,గల్లా అప్పారావు, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆదిలాబాద్ డి సి సి బి చైర్మన్ గా దళిత నేత

Satyam NEWS

హెచ్ఎండిఏ పరిధిలో 100 హైరిస్క్ ప్రాంతాల గుర్తింపు

Satyam NEWS

రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి నిధులివ్వాలి

Satyam NEWS

Leave a Comment