31.2 C
Hyderabad
May 3, 2024 01: 57 AM
Slider వరంగల్

రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికుల సంక్షేమానికి నిధులివ్వాలి

#TadyTappers

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని, ఏజెన్సీ ఏరియాలో గీత కార్మిక సొసైటీలను పునరుద్ధరించాలని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి. రమణ డిమాండ్ చేశారు.

ఈరోజు ములుగు లో కల్లుగీత కార్మిక సంఘం  క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగిన జిల్లా సమావేశంలో రమణ మాట్లాడుతూ రాష్ట్ర గీత కార్పొరేషన్ ఉన్నప్పటికీ దానికి బడ్జెట్ కేటాయింపులు లేకపోవడంతో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం లేదన్నారు.

నామినేటెడ్ బాడీని కూడా ఏర్పాటు చేయలేదు. పాత బాకీలు వసూలు చేయడం కోసమే ప్రస్తుతం కొంత మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. అందుకని ప్రభుత్వం బడ్జెట్ కేటాయించి గీత వృత్తిని ఆధునీకరణ పద్ధతులలో చేసే విధంగా చూడాలి. గౌడ యువతీ యువకులకు ఉపాధి అవకాశాల పై దృష్టిసారించాలి అన్నారు.

ఏజెన్సీ ఏరియాలో తరతరాలనుండి వృత్తి చేస్తున్న గీత కార్మికులకు సొసైటీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని, ప్రభత్వ సంక్షేమ పథకాలు వీరికి వర్తింపజేయాలనీ డిమాండ్ చేశారు.

డిమాండ్స్

రాష్ట్ర బడ్జెట్లో ఐదు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి

కల్లుగీత ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి

చెట్ల పెంపకానికి భూమి, కల్లుకు మార్కెట్,నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలి

మెడికల్ బోర్డు నిబంధన తొలగించాలి

గిరిజన ప్రాంతంలో ఉన్న గీత సొసైటీలను పునరుద్ధరించాలి. సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి

కొత్త జిల్లాల పేరుతో డిజిటల్ గుర్తింపు కార్డులు ఇవ్వాలి

ప్రభుత్వం సొసైటీలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కాకుండా చూడాలి.

భూమి రిజిస్ట్రేషన్ పత్రాలు సొసైటీలకు అప్పగించాలి

గీత కార్మికులందరికీ ద్విచక్ర వాహనం ఇవ్వాలి

జిల్లా కేంద్రం లో నీరా తాటి ఉత్పత్తుల పరిశ్రమ ఏర్పాటు చేయాలి

జిల్లా అద్యక్షులు పులి నర్సయ్య అద్యక్షన జరిగిన ఈ సమావేశంలో సర్దార్ సర్వాయి పాపన్న మెమోరియల్ ట్రస్ట్  చైర్మన్ తాల్లపెల్లి రామస్వామి, జిల్లా కార్యదర్శి గుండెబోయిన రవి గౌడ్, రాష్ట్ర కమిటీ సభ్యులు తాళ్ళ పెళ్లి నర్సయ్య, పంజాల శ్రీనివాస్,  బుర్ర  శ్రీనివాస్, రుద్ర బోయిన మల్లేష్, కారుపోతుల యాదగిరి గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

నక్షత్రం నిర్మాణం చూశారా..? వెల్లడించిన నాసా

Sub Editor

ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా చర్యలు తీసుకోండి

Satyam NEWS

డెత్ ప్లే : ప్రమాదవశాత్తు అమెరికాలో వైద్య విద్యార్థి మృతి

Satyam NEWS

Leave a Comment