కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిరంకుశంగా తీసుకువస్తున్న పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ నరసరావుపేటలో భారీ నిరసన ర్యాలీ జరిగింది. నరసరావుపేట ముస్లిం మత పెద్దలు అంబేద్కర్ గారి విగ్రహం వద్ద తమ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
జన జీవన స్రవంతి నుంచి ముస్లింలను వేరు చేసే ఈ కుట్రను అందరూ ప్రతిఘటించాలని ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు అన్నారు. దేశంలో ముస్లింలను రెండో శ్రేణి పౌరులుగా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ విధంగా కుట్ర పన్నుతున్నదని దీన్ని ప్రజాస్వామ్యవాదులు ఎవరూ సహించరాదని వారు అన్నారు.
పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిరంగరంగా పోరాటం చేసేందుకు నరసరావుపేటలో పార్టీలకు అతీతంగా ముస్లిం జెఏసి ఏర్పాటు అయింది.