38.7 C
Hyderabad
May 7, 2024 15: 54 PM
Slider ముఖ్యంశాలు

ఎమ్మెల్యే కార్పొరేటర్ వార్ : శిలాఫలకాల వద్ద కాంగ్రెస్ ఆందోళన

#corporator war

ఎమ్మెల్యేది ఓ దారి, కార్పొరేటర్ ది మరో దారి డివిజన్ అభివృద్ధి గోదావరి పాలు అని ఉప్పల్ ఏ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. అధికార పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే, చిలుకానగర్ కార్పొరేటర్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ తారస్థాయికి చేరుకుంది. దీని ప్రభావం డివిజన్ లో అభివృద్ధి నిర్మాణ పనులపై బ్రేక్ పడింది.

ఈ దశలో కొన్ని నెలలుగా డివిజన్ లో వేసిన శిలాఫలకాలు ఎక్కిరిస్తున్నాయి. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా అభివృద్ధి అంతా ఆగిపోయి ప్రజలకు శాపంగా మారుతోంది. వీరిద్దరి మధ్య ఏర్పడిన వివాదం తారాస్థాయికి చేరుకోవటంతో డివిజన్ పరిధిలో అభివృద్ధి నిర్మాణ పనులను ఎలా చేపట్టాలని జిహెచ్ఎంసి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ ఇద్దరు పేరుకే అధికార పార్టీ కానీ వీరిద్దరిది ఎవరి ఎ జండా వారిదే, నిధులు మంజూరైనా కానీ పనులను ప్రారంభించకపోవడంతో డివిజన్ లో అభివృద్ధికి ఆటంకంగా మారింది.

దీంతో డివిజన్లోని సమస్యలు కూపంగా మారి ప్రజలు ఇబ్బందులకు గురై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అదునుగా ప్రజలు , ప్రతిపక్ష పార్టీలు మూకుమ్మడిగా ఒకే అధికార పార్టీలో ఎమ్మెల్యే, కార్పొరేటర్ కు ఎన్ని గొడవలు ఉన్నా అభివృద్ధి నిర్మాణ పనులు ఆపు చేయకూడదని అంటున్నారు .

ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందుముల పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బస్తి వాసులతో కలిసి గురువారం శిలాఫలకాల వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే, కార్పొరేటర్ తో సంబంధం లేకుండా జీహెచ్ఎంసీ అధికారులే అభివృద్ధి నిర్మాణ పనులను చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యేది ఓ దారి, కార్పొరేటర్ ది మరో దారి చిలుకానగర్ డివిజన్ పరిధిలో అభివృద్ధి గోదావరి పాలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రతినిది తొఫిక్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోరంపేట కృష్ణ ముదిరాజ్ ,ఉప్పల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకారపు అరుణ్ ,ఏ -బ్లాక్ ఎస్ ,సి ,విభాగం అధ్యక్షులు లింగంపల్లి రామకృష్ణ ,మహిళా ఏ -బ్లాక్ అధ్యక్షురాలు అమరేశ్వరి ,హబ్సిగూడ ఉప్పల్ అధ్యక్షులు కాలేరు జై నవీన్ ,బాకారం లక్ష్మణ్ ,డివిజన్ అధ్యక్షురాలు సుశీల ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యం ,ఓర్సు పెంటయ్య ,బూర్గుల రమేష్ గౌడ్ ,నల్లవెలి

మహేందర్ ముదిరాజ్ ,మంచాల రఘు ,వల్లపు శ్రీకాంత్ యాదవ్ ,ఉప్పల్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి అమర్ ,ఉప్పల్ డివిజన్ ఎస్ సి విభాగం అధ్యక్షులు నాగారం వెంకటేష్ ,రామంతాపూర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు యోగి ,గౌస్ ,స్క్ కే మొయినుద్దీన్ ,దండుగుల శంకర్ ,సురేష్ ,శివ ,కుమార్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

అరుదైన మైలురాయి చేరుకున్న స్టార్టప్ లు

Satyam NEWS

క్లారిటీ: ఇద్దరు యువతులు ఒక బాలిక మృతికి కారణం ఇదే

Satyam NEWS

నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ఉక్కు పాదం

Satyam NEWS

Leave a Comment