39.2 C
Hyderabad
May 3, 2024 13: 26 PM
Slider మహబూబ్ నగర్

నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ఉక్కు పాదం

#Nagarkurnool Police

నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై ఉక్కుపాదం మోపడం ద్వారా రైతాంగం ఆర్థికంగా నష్టపోకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పి డాక్టర్ వై. సాయి శేఖర్ ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి అదేశాల మేరకు క్షేత్ర స్థాయి అధికారులు ఇలాంటి కేసులపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు.

గురువారం డిజిపి అన్ని జిల్లాల ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు,తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ అధికారులు,  పోలీస్ అధికారులందరితో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన విత్తనాలు లభించడం వల్ల పంట దిగుమతి అధికంగా పొందే అవకాశం ఉంటుందని, నకిలీ విత్తనాలు, నాణ్యత లేని విత్తనాలు కొనుగోలు చేస్తే ఆర్థికంగా రైతాంగం తీవ్రంగా నష్టపోతారని చెప్పారు.

నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం

అందువల్ల పోలీస్ అధికారులంతా నకిలీ విత్తనాల విషయంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి నకిలీ విత్తనాలను అడ్డుకోవాలని డిజిపి సూచించారు. అదే సమయంలో నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ఉక్కుపాదం మోపాలని, తెలంగాణలో నకిలీ విత్తనాలు అమ్మాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని డిజిపి తెలిపారు.

రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నకిలీ విత్తనాల వల్ల నష్టపోకుండా పతిష్టమైన చర్యలు తీసుకొని రైతులు నష్టపోకుండా కాపాడాలన్నారు. నకిలీ విత్తన విక్రయదారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, పి.డి.యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు.

లాక్ డౌన్ లో పోలీసుల సేవలు అద్వితీయం

కోవిడ్ – 19 అరికట్టడంలో కీలకంగా పని చేయడంతో సమాజ సేవలో సైతం భాగస్వామ్యం కావడం ద్వారా ప్రజలకు అందించిన సేవలు అద్వితీయమని డిజిపి మహేందర్ రెడ్డి అభినందించారు. ప్రజలలో పోలీస్ శాఖపై వచ్చిన మంచి పేరు, అభిమానం శాశ్వతంగా నిలబెట్టుకునేలా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.

కరోనా ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితులలో దానితో కలిసి జీవనం చేయాల్సి వచ్చిందని, పోలీస్ అధికారులు, సిబ్బంది అన్ని రకాల జాగ్రత్తలు వహిస్తూ విధి నిర్వహణ చేయాలని సూచించారు. అనారోగ్య లక్షణాలు, కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని డిజిపి సూచించారు.

అవసరమైతే ఐసోలేషన్ చేయించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అన్ని పోలీస్ స్టేషన్లలో థర్మల్ స్క్రీనింగ్ అందుబాటులో ఉంచాలన్నారు. ఆక్సీమిటర్లను అన్ని పోలీస్ స్టేషన్లకు అందించనున్నామని, అదేవిధంగా ప్రతి ఒక్కరు ప్రాణాయమం వంటి వ్యాయమం చెయ్యడం వంటివి చెయ్యడం ద్వారా ఉపిరితిత్తుల పనితీరు మేరుగుపడే అవకాశం ఏర్పడుతుందని తెలిపారు.

పోలీసులు రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి

పోలీస్ సిబ్బంది అందరిలో రోగ నిరోధక శక్తిని పెంచడం లక్ష్యంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం నాగర్ కర్నూల్  జిల్లా ఎస్పీ డాక్టర్ వై. సాయి శేఖర్ జిల్లా లోని సిబ్బందితో మాట్లాడుతూ జిల్లాలో నకిలీ పత్తి విత్తనాల విక్రయాలపై పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు.

వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయి అధికారుల ఆధ్వర్యంలో తీసుకుంటున్న చర్యలను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా రైతులకు అవగాహన కల్పిస్తూనే నకిలీ విత్తన విక్రయదారుల సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు.

అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా పెంచడంతో  పాటు గత సంవత్సరం కేసులు నమోదు చేసిన వ్యక్తుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిoచాలని సిబ్బందికి సూచించారు. వీడియో కాన్ఫరెన్స్ లో నాగర్ కర్నూల్ జిల్లా  పోలీస్ కార్యాలయoలో  ఏఆర్ అడిషనల్ ఎస్పి అనోక్ జయకుమార్ పాల్గొన్నారు.

ఇంకా ఏఆర్ డిఎస్పి దీపక్ చంద్ర, డిఎస్పి మోహన్ రెడ్డి , సి ఐ లు గాంధీ నాయక్ , రామ్ లాల్ , సర్కిల్  ఎస్ఐ లు, ఐ టి సిబ్బంది, జిల్లా లో వేర్వేరు పోలీస్ కార్యాలయాలలో  జిల్లా లోని డిస్పిలు,   ఇన్స్పెక్టర్లు,  ఎస్ఐ లు కూడా  పాల్గొన్నారు.

Related posts

ములుగు మండలంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమం

Satyam NEWS

హాసిని గాయత్రి క్రియేషన్స్ బ్యానర్ ప్రొడక్షన్ 1 చిత్రం ప్రారంభం !

Bhavani

మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాలు తక్షణమే పెంచాలన్న సిఐటియు

Satyam NEWS

Leave a Comment