40.2 C
Hyderabad
May 6, 2024 15: 47 PM
Slider హైదరాబాద్

ఘనంగా మణిపూర్ మహరాణీ గైడిన్లుయా 108వ జయంతి

#Maharani Gaidinluya

మణిపూర్ మహరాణీ రాణి గైడిన్లుయా 108వ జయంతిని సందర్భంగా కాప్రా సర్కిల్ భవాని నగర్ లోని హైదరాబాద్ ఆధార్ సోసైటీ కార్యలయంలో అధ్యక్షులు గొంది వెంకటరమణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆధార్ సొసైటీ సభ్యులు మెట్ల పాపయ్య ఆమె చిత్రపటానికి పూలమాలేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాణీ గైడిన్లుయా బాల్యం నుండే స్వాతంత్ర ఉద్యమంతో పాటు అస్సాం, మణిపూర్ ఆదివాసి ప్రజల స్వేచ్ఛ జీవనం హక్కుల పరిరక్షణకై తుది శ్వాస విడిచే వరకు పోరాడిన వీరవనిత అని ఆమె సేవలను కొనియాడారు.ఆదివాసి మహనీయుల చరిత్రను ఉద్యమ యోధులను నేటి సమాజం గుర్తించుకొని వారి ఉద్యమ స్ఫూర్తితో భవిష్యత్తు ఆదివాసి ఉద్య మాలు నిర్మించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా స్పోర్ట్స్ లో రాణిస్తున్న రన్నింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో రజిత, సిల్వర్ మెడల్స్ పొందిన ఆదివాసి క్రీడాకారులు కుంజా రంజిత, పాయం కుమారులను సత్కరించి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి స్టూడెంట్స్ ఫోరం రాష్ట్ర నాయకులు (ఏఎస్ఎఫ్) అరెం అరుణ్, సాగబోయిన పాపారావు, నాయకులు మడివి అజయ్, సోడి రాంబాబు, అల్లెం భరత్ కుమార్, పూణెం కృష్ణవేణి, వరస నాగమణి, కర్పిత స్వప్న, రమ్య, రాజీవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కెసిఆర్ జైలుకే

Satyam NEWS

జాతీయ స్థాయిలో ఐసీఏఆర్ 14వ ర్యాంకు గ‌ర్వ‌కార‌ణం

Sub Editor

ఉద్యమ బాట: భిక్షాటన చేయనున్న ఇండస్ట్రియల్ జోన్ బాధిత రైతులు

Satyam NEWS

Leave a Comment