30.7 C
Hyderabad
May 5, 2024 04: 40 AM
Slider విజయనగరం

అక్ర‌మ క‌ట్ట‌డాల‌పై ఎమ్మెల్యే ఆగ్ర‌హం….కార్పొరేష‌న్ అధికారుల‌పై కోపం…!

#kolagatla

జ‌గ‌న‌న్న ప‌చ్చ తోర‌ణంలోభాగంగా రోజూ లానే విజ‌య‌న‌గ‌రంలో  మొక్క‌లు నాటుతున్న స్థానిక‌ ఎమ్మెల్యే లో ఒక్క‌సారి ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది.అదీ న‌గ‌రంలోని ఆయ‌న‌ నివాసం వెన‌క  ఉన్న న‌ట‌రాజ కాల‌నీ లో స్థానికులు చెప్పిన స‌మ‌స్య‌ల‌పై అక్క‌డిక్క‌డే  రోజూ త‌న ఇంటికి వచ్చి క‌లుస్తున్నారే త‌ప్ప స‌మ‌స్య‌లు ఎందుకు చెప్ప‌లేదంటూ వారిపై అస‌హ‌నం వ్య‌క్తం చేసారు… ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌.

మున్సిప‌ల్ కార్పొరేష‌న్ అధికారులను పిలిచి సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఎందుకు చెడ్డ పేరు తీసుకువ‌స్తున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. మీరు జీతాలు తీసుకోవ‌డం లేదా….?24 గంట‌లు ప‌ని చేయ‌న‌క్క‌ర్లేదా..? చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అనుకుంటున్నారా..?  అంటూ మీడియా ఎదుటే విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే,ఉత్త‌రాంద్ర వైఎస్ఆర్సీపీ క‌న్వీన‌ర్ కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర‌స్వామి అటు అధికారుల‌పైన‌, ఇటు కార్య‌ద‌ర్శుల‌పై ధ్వ‌జ‌మెత్తారు.

న‌ట‌రాజ్ కాల‌నీలో ఓ  వైపు  ప్ర‌వ‌|హిస్తున్న మురుగు నీరు,మరోవైపు వంగిపోయిన విద్యుత్ స్తంభాలు,ఇంకోవైపు రేకుల‌తో ఉన్న అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను క‌ళ్లారా చూసిన ఎమ్మల్యే కోల‌గ‌ట్ల అక్క‌డిక్క‌డే ఎలక్ట్రిక‌ల్  డీఈ,ప్లానింగ్ ఇఈల‌కు  త‌క్ష‌ణం మ‌ర‌మ్మ‌త్తులు చేయాల‌ని ఆదేశించారు. అదే  విధంగా అక్ర‌మంగా రేకులు వేసిన వ్య‌క్తి తాలుకా కాగితాలు చూపించాల‌న్నారు.

ఈ సంద‌ర్భంగా దాదాపు గంటల సేపు ఎమ్మెల్యే అదే కాల‌నీలో స‌మ‌స్య‌ల‌ను గురించి వాటి ప‌రిష్కారంపై అటు స్థానికులు,ఇటు అధికారుల‌తో చ‌ర్చించారు.అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ..జ‌గ‌న‌న్న ప‌చ్చ తోర‌ణంలో భాగంగా స్థానిక న‌ట‌రాజ్ కాల‌నీలో దాదాపు 56 మొక్క‌ల‌ను నాటామ‌న్నారు. గ‌త ప్ర‌భుత్వం మాదిరిలా కాకుండా ఎవ్వ‌రైతే మొక్క‌ను వేసారో వాళ్ల‌దే ఆ మొక్క పెంప‌క‌పు  బాధ్య‌త ను గుర్తు చేస్తూ వాళ్ల ఇంట్లో ప‌ర‌మ‌ప‌దించిన వాళ్ల జ్ఙాప‌కార్తం పేరు పెట్టే  ఆ మొక్క‌కు ర‌క్ష‌ణ బాద్య‌త‌ల‌ను అప్ప‌గిస్తున్న‌ట్టు ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల చెప్పారు. 

కార్య‌క్ర‌మంలో మేయ‌ర్ వెంప‌డాపు విజ‌య‌ల‌క్ష్మీ మాట్లాడుతూ ఈ జ‌గ‌న‌న్నప‌చ్చ‌తోర‌ణం కార్య‌క్ర‌మంలో ప్ర‌తీ ఒక్క‌రినీ భాగ‌స్వాముల‌ను చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో డిప్యూటీ మేయ‌ర్,28 డివిజ‌న్ కార్పొరేట‌ర్ కోల‌గ‌ట్ల  శ్రావ‌ణి, 33వ డివిజ‌న్ కార్పొరేట‌ర్ రంగారావు, స్థానిక కార్పొరేట‌ర్  త‌ద‌దిత‌రులు పాల్గొన్నారు.

Related posts

ఒక సలహాదారుడిపై ఏపీ సర్కార్ వేటు

Satyam NEWS

వివాహిత మృతి: భర్తపైనే అనుమానం

Satyam NEWS

ప్రధానోపాధ్యాయుని హత్య

Bhavani

Leave a Comment