27.7 C
Hyderabad
May 14, 2024 09: 42 AM
Slider ముఖ్యంశాలు

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) సభలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

#kavita

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) 17 వ మహాసభల్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొననున్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో జూలై 1-3 వరకు జరగనున్న ఆటా మహాసభలు – యూత్ కన్వెన్షన్ లో పాల్గొనాల్సిందింగా ఎమ్మెల్సీ కవితను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.

జూలై 2 న ఆటా మహాసభల్లో పాల్గొననున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆ రోజు మధ్యాహ్నం తెలంగాణ పెవిలియన్ ను ప్రారంభించనున్నారు. 

సాయంత్రం 8 గంటలకు, దాదాపు 10వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఆటా ప్రైమ్ మీట్ లో ఎమ్మెల్సీ కవిత అతిధిగా హాజరుకానున్నారు. అనంతరం ఇదే సమావేశంలో బతుకమ్మ పండుగపై ఆటా ప్రచురించిన బతుకమ్మ ప్రత్యేక సంచికను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించనున్నారు.

ప్రతిష్టాత్మకంగా ఆటా నిర్వహించే ఈ వేడుకలు ఈ సంవత్సరం మరింత పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు. వందలాదిగా వలంటీర్లు వివిధ ఏర్పాట్ల కోసం 80 కమిటీలుగా ఏర్పడి ఇందుకోసం శ్రమిస్తున్నట్లు ఆటా ప్రతినిధులు తెలిపారు.

Related posts

ఇదీ మన సంస్కారానికి నిదర్శనం

Satyam NEWS

ఆపదలో ఉన్నప్పుడు నిస్సందేహంగా డయల్ 100

Satyam NEWS

ఖమ్మం పోలీస్ కమీషనర్ గా విష్ణు వారియర్

Satyam NEWS

Leave a Comment