ఏదైనా ఆపద ఎదురైనప్పుడు డయల్ 100 నకు ఫోన్ చేయడానికి భయపడాల్సిన అవసరం లేదని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ట్రైనీ ఐపీఎస్ రోహిత్ రాజు అన్నారు. పోలీసులు ప్రజల తమ రక్షణ కోసమే పాటుపడుతూ ఉంటారని ఆయన అన్నారు. జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు కొత్తగూడెం త్రీటౌన్ సీఐ ఆదినారాయణ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్ర హైస్కూల్ లో డయల్ 100 పై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రోహిత్ రాజు ఐపిఎస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 300 మంది విద్యార్థిని,విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ ఎప్పుడూ స్కూళ్ల వద్ద, కాలేజీలు, రైల్వే స్టేషన్, బస్టాండ్ల వద్ద నిరంతరం మఫ్టీ దుస్తులలో సంచరిస్తూ ఉంటారని రోహిత్ రాజు తెలిపారు. అదే విధంగా విద్యార్థులు అందరూ కూడా శ్రద్ధగా చదువు కొని ఉన్నత స్థాయి ఉద్యోగాల్లో చేరి ప్రజలకు సేవ చేస్తూ తమ తల్లిదండ్రులకు, తమ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో త్రీటౌన్ ఎస్ఐ బి.శ్రీనివాసరావు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.