33.2 C
Hyderabad
May 4, 2024 00: 07 AM
Slider ముఖ్యంశాలు

దివ్యత్వానికి త్యాగానికి ప్రతీక గా మొహర్రం

#DevarakondaMohram

మత సామరస్యానికి ప్రతీకగా ముస్లింలు, హిందువులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండగల్లో మొహర్రం ఒకటి. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్న ఏడు మండలాల్లో వారం రోజుల పాటు జరిపే ఈ పండగ సందర్భంగా మతానికి సంబంధించిన ప్రవచనాలు, మొహమ్మద్ ప్రబోధనలు జరుగుతాయి.

మొహర్రం నెలలో పీర్లను ఊరేగింపుగా తీసుకువెళతారు. నగరాలు పట్టణాలు గ్రామాల్లో పెద్ద ఎత్తున హస్సేన్ హుస్సేన్ లకు హజ్రత్ హున్సేన్ (ర.జి) శత్రువుల చేతిలో గుర్తుగా పంజా (ప్రతిమ)లను ముస్తాబు చేసి ఊరేగింపు చేసి తమ సంతాపం ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

మొహర్రం పర్వదినం నేపథ్యంలో దేవరకొండ ప్రాంతంలోని పల్లెల్లో కూడా సందడి నెలకొని ఉంది. మొహర్రం అనేది వాస్తవానికి పండగ కాదు. ఇస్లాం కేలండర్ ప్రకారం తొలి మాసాన్ని మొహర్రం నెలగా పిలుస్తారు. అయితే ఈ నెలలో 10వ రోజుకు ఓ ప్రత్యేకత ఉందని మతగురువులు చెబుతుంటారు.

వారి కథనం ప్రకారం మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ హుస్సేన్ వీరమరణం పొందుతాడు. ఆయనతో పాటు 70 మంది వరకు మహమ్మద్ ప్రవక్త వంశానికి చెందిన వారు అమరులౌతారు. ఇది ఇరాక్ ప్రాంతంలో యాజిత్ తెగతో యుద్ధం జరుగుతుంది.

ఈ సందర్భంలో హజ్రత్ యుద్దానంతరం యాజిద్ తెగకు చెందిన వారు పశ్చాతాపం చెంది. దేవుడా మేం తప్పు చేశాం. ప్రవక్త వంశానికి చెందిన వారిని మా చేతులతో హతమర్చాం. కాబట్టి మిమ్మల్ని మన్నించమని గుండెల మీద చేతులతో బాదుకుంటూ బిగ్గరగా ఏడుస్తూ నిప్పులపై నడుస్తారు.

అప్పటి నుంచి ప్రారంభమైన సాంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగుతోంది. యాజిత్ తెగకు ఎప్పటికీ మోక్షం ఇవ్వొద్దని హజ్రత్ ఇమామ్ హుస్సేన్ అల్లాహ్ ను ప్రార్థిస్తూ ప్రాణాలు విడుస్తారు. ఈ సందర్భంగా ఆయన త్యాగానికి ప్రతీకగా మొహర్రం నెలలో ముస్లింలు తమ ఇళ్లలో ఎలాంటి శుభకార్యాలు చేయరు.

ఇదిలా ఉండగా మరోవైపు మహమ్మద్ ప్రవక్త సంతాపం తెలిపే ఉద్దేశంతో దీన్ని పాటిస్తారు. అమరులైన వారి  యాగాల ప్రతి రూపానికి చిహ్నంగా మొహర్రం వేడుకలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ పరిధిలో దేవరకొండ, చింతపల్లి, డిండి, చందంపేట, నేరేడుగొమ్ము, పీఏ పల్లి, మర్రిగూడ, నాంపల్లి తదితర మండలాల్లో ప్రభుత్వం సూచించిన కరోనా నిబంధన ప్రకారం లోబడి ముజావర్ల ఆధ్వర్యంలో మాత్రమే మొహర్రం వేడుకలు మత సామరస్యానికి ప్రతీకగా  హిందూ ముస్లింలు కలిసి జరుపుకుంటున్నారు.

ముస్లిం సోదరులు వారికి సంతాపంగా రెండు రోజుల పాటు ఉపవాస దీక్ష పాటిస్తారు. అదే సాంప్రదాయం ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తోంది. మొహర్రం నెలలోని తేదీల్లో ఉపవాస దీక్ష పాటించడాన్ని ముస్లింలు పవిత్రంగా భావిస్తారనేది ఆనవాయితీ సంప్రదాయం. ఈ వేడుకల్లో హిందూ, ముస్లింలు కలిసి మొహర్రం వేడుకలు జరుపుకొని ఐకమత్యంతో ఉండటం మనం గ్రామాల్లో మనం ప్రతి ఏడు చూస్తున్నాం.

పి.వెంకటేష్, దేవరకొండ

Related posts

సెలబ్రేషన్స్: సంబురాల్లో ప్రత్యేక ఆకర్షణగా మాగంటి

Satyam NEWS

చింతవట్ల లింగన్నకు నివాళులర్పించిన రంగినేని అభిలాష్ రావు

Satyam NEWS

తెలుగు సినిమాకు మరో ఆశాకిరణం డాక్టర్ టర్నడ్ డైరెక్టర్ రవికిరణ్ గాడాల!!

Satyam NEWS

Leave a Comment