27.7 C
Hyderabad
May 4, 2024 10: 58 AM
Slider ప్రత్యేకం

వీరపాండ్య కట్టబ్రహ్మన ఏకపాత్రాభినయంతో కళా స్పూర్తి కలిగించిన గుంటి పిచ్చయ్య

#guntipitchiah

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ నాంపల్లి నందు యంగ్ ఇండియన్ అసోసియేషన్,స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో టి ఎఫ్ సి సి సాంస్కృతిక కార్యక్రమాల్లో సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల కేంద్ర నివాసి డాక్టర్ గుంటి పిచ్చయ్య ప్రదర్శించిన వీరపాండ్య కట్ట బ్రహ్మన ఏకపాత్రాభినయం పలువురిని అలరించి ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన డాక్టర్ కొత్త రామనాధం,డాక్టర్ మల్లాది విజయలక్ష్మి మాట్లాడుతూ స్వాతంత్ర్య సంగ్రామంలో అనేకమంది స్వాతంత్ర్య సమరయోధులు తమ ప్రాణాలను అర్పించారని,అందులో అగ్రగణ్యుడైన వీరపాండ్య కట్టబ్రహ్మన పాత్రను రసవత్తరంగా పోషించిన డాక్టర్ గుంటి పిచ్చయ్యను అభినందనలతో ప్రశంసించారు.

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ఫౌండర్,చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్ తో పాటు పలువురు కవులు,కళాకారులు ఆధ్యాత్మికవేత్తలు,టి ఎఫ్ సి సి చైర్మన్ లయన్ ప్రతాపు రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

వెంకన్న పింక్ డైమండ్ కథ కంచికేనా?

Satyam NEWS

పాకాల ఏటి పై హైలేవల్ వంతెన నిర్మించాలి

Bhavani

జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే.. ప్రజలను హెచ్చరించిన కమిషనర్

Satyam NEWS

Leave a Comment