29.7 C
Hyderabad
May 4, 2024 05: 08 AM
Slider తెలంగాణ

థాంక్స్: బిసి, ఎంబిసిలకు అధికారంలో వాటా ఇచ్చారు

bc ktr 1

తెలంగాణ రాష్ట్రంలో పురపాలక ఎన్నికలలో బి సి , ఎం బి సి కులాలకు పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం కల్పించటం పై తెలంగాణ బి సి సంఘాల ప్రతినిధులు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో పలు బిసీ సంఘాల నేతలు కేటీఆర్ ను కలిశారు. 

గత 70 ఏళ్ళలో ఏ పార్టీ కూడా బి సి కులాలకు కనీసం వార్డు మెంబర్ గా అవకాశం ఇవ్వలేదని వారన్నారు. ఆ దశ నుండి అణగారిన కులాలకు, ఇన్నాళ్లు అధికారానికి దూరంగా ఉన్న అట్టడుగు కులాలైన బీ సీ,  ఎం బీ సీ లకు పెద్ద ఎత్తున పదవులు కల్పించినందుకు బీ సీ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ చేసి చూపించారని వారు తెలిపారు.

బీసీ, ఎం బీ సీ లకు 58 మేయర్,  ఛైర్ పర్సన్ పదవులు, 45 వైస్ చైర్ పర్సన్ పదవులలో అవకాశం కల్పించినందుకు బీ సీ సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. బీ సీ లలో గౌడ్ లకు 17, ముదిరాజ్ లకు 13, మున్నురు కాపు లకు 21, పద్మశాలీలకు 13, యాదవ 18, లింగాయత్ లకు 6, కురుమలకు 4, ఆర్యక్షత్రియలకు 3 పదవులు దక్కాయి. ఇన్నాళ్లూ అధికారానికి దూరంగా వున్న ఎంబీసీ కులాలు పరకాల లో సఫాయి కర్మచారీ, నేతకానీ, బుడగ జంగాలకు 1, కుమ్మరి పట్కరి, పెరిక, వడ్ల, పద్మశాలి, ఎల్లాపు, రెడ్డిక, అవుసాలి వారికి ఒక్కొక్కటి చైర్మన్ పదవులు దక్కినట్లు వారు చెప్పారు. కోర్టు నిర్దేశించిన రిజర్వేషన్ల కంటే అధికంగా సుమారు 45 శాతం పదవులు లభించాయని వివరించారు. ఈ కార్యక్రమములో రాష్ట్ర బీ సీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ , జాతీయ ఎం బీ సీ సంఘం అధ్యక్షులు కె సి కాళప్ప , డా. విజయ్ భాస్కర్ గౌడ్,  ప్రేమ్ లాల్, మల్లిఖార్జున్ ఖడ్గే, శ్రీనివాస్ నాయి లతో పాటు 107 B C  సంఘాల ప్రతినిధులు  పాల్గొన్నారు. 

Related posts

ఎంత కొత్త యుద్ధమైనా పాతదే..

Satyam NEWS

డిప్యూటీ సీఎం చేతుల‌ మీదుగా అవార్డు అందుకున్న‌ ఏఎస్ఐకి ప‌దోన్న‌తి

Satyam NEWS

ఇద్దరు కుమారులతో కలిసి తల్లి ఆత్మహత్య

Bhavani

Leave a Comment