పౌరసత్వ చట్టం, ఎన్ ఆర్ సి, ఎన్ ఆర్ పి లకు వ్యతిరేకంగా కడప జిల్లా జిల్లా రాజంపేట పట్టణంలో చేపట్టిన రిలేనిరాహార దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ చట్టాలను రద్దు చేయాలని రిలే నిరాహారదీక్షలు చేపట్టిన ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు. నేడు తొమ్మిదో రోజు నిరసనలలో భాగంగా ముస్లింలు వామపక్ష కార్యకర్తలతో కలసి అర్ధనగ్నంగా మోకాళ్ళ పై కూర్చుని నినాదాలు చేశారు. అనంతరం వివిధ పార్టీల నేతలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
దేశంలో అన్నదమ్ములు గా మెలుగుతున్న హిందూ ముస్లింల మధ్య చిచ్చు పెట్టె విధంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రవర్తిస్తున్నారని వారు విమర్శించారు. సి.ఏ.ఏ, యనార్సీ యన్.పి.ఆర్ లను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఉద్యమం లో భాగంగా రాజంపేటలో తీవ్ర తరం చేయనున్నట్టు మైనారిటీ నాయకుడు గుల్జార్ బాషా హెచ్చరించారు. వామపక్ష నేతలు మహేష్, రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.