29.7 C
Hyderabad
May 6, 2024 05: 44 AM
Slider ఖమ్మం

రోడ్డు ప్రమాదంలో నూరేళ్లూ నిండిన నిండుచూలాలు

mother and child

అత్యంత దారుణమైన సంఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో జరిగింది. ఒక్క సారిగా కన్నీరు తెప్పించే ఈ దుర్ఘటనలో నిండుచూలాలు మరణించింది. ఆమె తో బాటు ఆమె గర్భంలో ఉన్న నెలలు నిండిన పసిగుడ్డు ఛిద్రమైంది. రోడ్డు పాలైంది. రోడ్డంతా రక్తం…మాంసం ముద్దలు.. నిస్సహాయ స్థితిలో ఆమె భర్త.

రామచందర్ రావు బంజార్ కి చెందిన  మురళి తన నిండు గర్భిణి అయిన భార్యను తీసుకుని పెనుబల్లి ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడ ఆమెకు వైద్య పరీక్షలు చేయించాడు. నెలలు నిండిన తన సతీమణిని ఎంతో జాగ్రత్తగా అతను తీసుకుని తిరుగు ప్రయాణమయ్యాడు. స్కూటర్ పై వస్తున్న వారిని అమాంతంగా ఒక లారీ ఢీకొట్టింది.

ఒక్క సారిగా వారి జీవితం ఆగిపోయింది. మురళి భార్య అక్కడికక్కడే చనిపోయింది. నెలలు నిండిన ఆ గర్భిణి కడుపు పై నుంచి లారీ వెళ్లింది. ఒక్క సారిగా గర్భస్థ శిశువు బయటకు వచ్చింది. పది అడుగుల దూరం వెళ్లి పడింది. దారుణమైన ఈ దుర్ఘటనలో ఇంకే మిగల్లేదు. రక్తం మాంసం తప్ప.

Related posts

స్కూళ్లకు 48 రోజులు వేసవి సెలవులు

Bhavani

(Free Trial) – Bothoan High Blood Pressure Medicine Why High Bp When Taking Medicine Drug Therapy Of Hypertension Cmu

Bhavani

రాష్ట్ర అభివృద్ధిని ప్రజలకు మరింత చేరువ చేయాలి

Satyam NEWS

Leave a Comment