Slider

ముంబయి నుంచి అదిలాబాద్ వరకు నందిగ్రామ్‌ రైలు..

special train

ఎంపీ సో యం బాపురావ్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 14 నుంచి ముంబయి నుంచి అదిలాబాద్ వరకు నంది గ్రామ్ ఎక్స్‌ప్రెస్‌ రైలు 11401, 11402 నడువనుంది.

ముంబయి..నాందేడ్..షిర్డీ మహారాష్ట్రకు ప్రయాణం సాగించేలా కినవట్ నుంచి నడుస్తున్న రైలు ను అదిలాబాద్ వరకు పొడిగించాలని ఎంపీ సోయం బాపూరావు రైల్వే జీఎం, డీజీఎంల‌కు ఇటీవల విన్నవించారు.

ఈ మేరకు 14 నుంచి రైలు తిరిగి ప్రారంభం కావడం పట్ల ఎంపీ సోయం బాపూరావు హర్షం వ్యక్తం చేశారు. ఉదయం 9.15 గంటలకు అదిలాబాద్‌ చేరుకుంటుందని .. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ముంబయి బయలుదేరుతుంది. రైల్వే జీఎంకి కృతజ్తలు తెలిపారు.

ఇది అదిలాబాద్ జిల్లా ప్రజలకు దీపావళి కానుకగా ఎంపీ పేర్కొన్నారు.

కాగా అదిలాబాద్ నుంచి ముంబ‌యికి ఎంతోమంది ప్ర‌యాణం చేస్తుంటారు.. ఈ నేప‌థ్యంలో ఈ ప్ర‌త్యేక రైలు ప్రారంభం కావ‌డంతో దూరాభార‌మే కాకుండా, చార్జీల రూపం, స‌మ‌యాభావం కూడా ఆదాకానుండ‌డంతో ప్ర‌జ‌లు ఎంపీ చొర‌వ‌, కేంద్ర నిర్ణ‌యంపై సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Related posts

వినాయక చవితి హిందువుల తొలి పండుగ

Satyam NEWS

రాజంపేటలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Satyam NEWS

ములుగు జిల్లాలో ఉపాధి హామీ నిధులతో పక్కా రోడ్లు

Satyam NEWS

Leave a Comment