28.7 C
Hyderabad
May 5, 2024 09: 45 AM
Slider మహబూబ్ నగర్

పి.పి.ఆర్ రోగ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలి

#WanaparthyCollector

గొర్రెలు, మేకలలో వచ్చే పారుడు (పి.పి.ఆర్) రోగ నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని వనపర్తి కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు.

మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామంలో గొర్రెలు, మేకలలో పారుడు రోగం (పీపీఆర్) నివారణ టీకాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 8వ తేది నుండి 20వ తేది వరకు టీకాల కార్యక్రమం జరుగుతుందని ఆమె తెలిపారు. టీకాలు గొర్రెలు, మేకలకు వేయించడం వలన వ్యాధి నిరోధక శక్తి పెరిగి, అవి ఆరోగ్యంగా ఉంటాయని, తద్వారా రైతులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుందని ఆమె రైతులకు సూచించారు. 

పశువైద్య, పశుసంవర్థక శాఖ రాష్ట్ర సంచాలకులు డా. లక్ష్మారెడ్డి మాట్లాడుతూ గొర్రెలు, మేకలలో పారుడు రోగం నివారణ టీకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. 

ఈ కార్యక్రమానికి వనపర్తి పశువైద్య & పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్ రెడ్డి, ఆయా మండలాల పశు వైద్య అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

అన్నమయ్య ప్రాజెక్టు నిండడంతో చెయ్యేటికి నీటి విడుదల

Satyam NEWS

కరోనా లేదని చెప్పిన వారు నేడు ఇంటికే పరిమితం

Satyam NEWS

5 Stats: కీలక ఎన్నికలకు మోగిన నగారా

Satyam NEWS

Leave a Comment