42.2 C
Hyderabad
April 26, 2024 16: 32 PM
Slider కడప

అన్నమయ్య ప్రాజెక్టు నిండడంతో చెయ్యేటికి నీటి విడుదల

#AnnamayyaProject

కడప జిల్లా రాజంపేట మండలంలోని అన్నమయ్య ప్రాజెక్టు నిండడం తో చెయ్యేటి లోనికి రెండు గేట్లు ద్వారా ఆదివారం సాయంత్రం నీటిని వదిలారు.

అన్నమయ్య డ్యామ్ పైన ఉన్న పించ డ్యామ్ గేట్లు ఎత్తడం వలన నీటి ప్రవాహం 2500 క్యూసెక్కుల నీరు చేరుతోంది. దీనితో అన్నమయ్య డ్యామ్ కెపాసిటి 202. 23948 మీటర్లుకు పూర్తి స్థాయిలో నీరు చేరు కుంది.

ఈ అన్నమయ్య డ్యామ్ రెండు గేట్ల ద్వారా 2300 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసారు. దిగువున ఉన్న రాజంపేట, నందలూరు, పెనగలూరు,మండలాల ప్రజలకు భూగర్భ జలాలు పెరిగి తాగడానికి, సాగు నీటి సమస్య ఉండదు.

దీనితో చుక్క నీరు లేక ఎండిపోయిన చెయ్యరు నీటితో కళకళ లాడానుంది. దీనితో దిగువ ప్రాంత రైతుల్లో హర్షం వ్యక్తం ఔతోంది. కాగా శనివారం ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 10 చెరువులకు నీటిని వదిలారు.

Related posts

When you might be writing your paper, it will be for most instances an honest technique to invest in some outdoor perspective

Bhavani

20 నుండి 24వ‌ సుంద‌రకాండ సర్గ శ్లోక అఖండ పారాయ‌ణ రేపు

Satyam NEWS

మహాయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

Bhavani

Leave a Comment