ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా లేనేలేదని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతున్నదని చెప్పిన రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) నేడుజనతా కర్ఫ్యూ సమయంలో ఇంటికే పరిమితమయ్యారు.
రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకుండా ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా వాయిదా వేస్తారని మంత్రి నాని ఎంతో ఆవేశంగా ప్రశ్నించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కన్నా ముందు ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎండగట్టిన మంత్రి నేడు ఇంట్లోనే ఉండిపోయారు.
తన ఇంట్లో టీవీ లో డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి ఆటో బయోగ్రఫీ చిత్రం” యాత్ర ” చిత్రాన్ని మరొక్క మారు చూసి టైమ్ పాస్ చేశారు. విజయవాడలో ఈ ఒక్క రోజే కాకుండా మరో రెండు రోజుల పాటు నిర్బంధ కర్ఫ్యూ కొనసాగించే దిశగా అధికారులు ఆలోచిస్తున్నారు.