29.7 C
Hyderabad
May 4, 2024 04: 39 AM
Slider ప్రత్యేకం

52 కోట్లతో మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన

#ktr

జంటనగరాల మధ్య కేంద్రమైన అంబర్ పేట నియోజకవర్గంలోని మూసారాంబాగ్ వద్ద గల మూసీ నదిపై పాత బ్రిడ్జి స్థానంలో 52 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి సోమవారం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాలను కల్పిస్తూ, కొత్త దశ దిశా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. మూసీ, ఈసీపై రూ. 545 కోట్ల‌తో 14 బ్రిడ్జిల‌కు శంకుస్థాప‌న చేసుకుంటున్నామ‌ని తెలుపుతూ వీటి ద్వారా హైద‌రాబాద్ లో ఒక అద్భుత దృశ్యాన్ని ఆవిష్క‌రించాలని ఆయన పేర్కొన్నారు. అంతే కాకుండా, రూ. 5000 కోట్లతో త్వరలోనే రెండవ దశ ఎస్ఎన్డీపీ పనులు చేపడతామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ మాట్లాడుతూ, మూసారాంబాగ్ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభం అయినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

బ్రిడ్జి నిర్మాణంతో గత కొన్నేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నందుకు సీఎం కేసీఆర్ కి, హై లెవల్ బ్రిడ్జికి శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్ కి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేశారు. అధిక వర్షాలు కురవడం తద్వారా హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ల నుండి మూసీలోకి భారీగా నీరు విడుదల చేసిన సందర్భాలలో మూసారాంబాగ్ వంతెనపై వరద నీరు ప్రవహించడం వలన ప్రజలకు కొన్ని రోజుల పాటు రవాణా, రాకపోకల విషయంలో తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయని, ప్రత్యేకంగా పోలీసులను పెట్టి పహరా కాయాల్సిన పరిస్థితులు కూడా నగర వాసులకు అనుభవమే అని చెబుతూ, ఈ హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ అటువంటి సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం అని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాల్లో కేవలం ప్రతిపాదనలకే పరిమితం అయిన కొత్త బ్రిడ్జి నిర్మాణం పనులను చేపట్టాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఎంతో శ్రద్ధ తీసుకొని అనేక పర్యాయాలు మంత్రులు, ఉన్నతాధికారులును కలిసి చివరకు కార్యరూపం సాధించినందుకు ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మలక్ పేట ఎమ్మెల్యే అహ్మద్ బలాల, కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, పద్మావెంకట్ రెడ్డి, దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

ఏపి సి ఎంకు భారత రాయబారి విందు

Satyam NEWS

బాగ్ అంబర్ పేట డివిజన్ లో ఘనంగా జ్యోతి రావు ఫూలే జయంతి

Satyam NEWS

ఘనంగా చాదర్ ఘాట్ రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం

Satyam NEWS

Leave a Comment