26.7 C
Hyderabad
May 3, 2024 07: 08 AM
Slider వరంగల్

నాయకపోడు కులస్తుల గణేష్ ఉత్సవంలో పాల్గొన్న డిఎస్పీ

#mulugu

ములుగు జిల్లా కేంద్రంలోని నాయకపోడు కులస్తులు ఏర్పాటు చేసుకున్న వినాయక విగ్రహ మండపంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో డిఎస్పి రవీందర్ పాల్గొన్నారు. నాయకపోడు కాలనీలోని నిర్వహించిన గణేష్ మండపంలో సోమవారం రోజున  భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు డిఎస్పి రవీందర్ విచ్చేసి వారి చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా గణనాధునికి పూలమాల వేసి, అలంకరణ చేసి ప్రత్యేక పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

గణపతికి నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధతో నిర్వహించాలని ఆయన అన్నారు.  తొమ్మిది రోజులపాటు నిష్టగా పూజా కార్యక్రమాలను నిర్వహించి నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కలిసిమెలిసిగా వినాయకుని నిమజ్జనం చేసుకోవాలని కోరారు. భగవంతుని పేరుతో అన్నదానం చేయడం మంచి కార్యక్రమాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయక పోడు కుల పెద్దలు సదయ్య, లక్ష్మణ్, కొత్త సురేందర్ రాజేందర్., తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రవీణ్ కుమార్ జోలికొస్తే సహించం

Bhavani

పుత్తూరు లో బస్సును ఢీకొన్న స్కూటర్…

Satyam NEWS

“బ్యాక్ డోర్” విడుదల వాయిదా! డిసెంబర్ 18 న ప్రేక్షకుల ముందుకు!!

Satyam NEWS

Leave a Comment