29.7 C
Hyderabad
May 4, 2024 05: 00 AM
Slider చిత్తూరు

ఆధ్యాత్మిక నగరంలో పౌరాణిక నాటకాలు

#Mythological dramas

తిరుపతి మహతి ఆడిటోరియంలో జరిగిన “శ్రీనివాస కళ్యాణం” పౌరాణిక నాటక కార్యక్రమానికి అతిథిగా హాజరైన రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డిని TTD ధర్మకర్తల మండల సభ్యులు ఎం రాములు సన్మానించారు. తిరుమల శ్రీవారి ముక్కోటి ఏకాదశి పర్వదినాన “శ్రీనివాస కళ్యాణం” పౌరాణిక నాటకాన్ని ప్రదర్శించడం అభినందనీయమని ఈ సందర్భంగా నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

తిరుమల తిరుపతి అంటేనే “నిత్య కళ్యాణం పచ్చ తోరణం” తిరుమల శ్రీవారి సన్నిధిలో పద్మావతి అమ్మవారి ఆలయంలో టిటిడి అనుబంధ ఆలయాలతో పాటు స్థానిక దేవాలయాలలో ప్రతినిత్యం జరిగే ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు కల్యాణోత్సవాలతో తిరుపతి నగరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడుతుంది.

హిందూ సనాతన ధర్మంలో అంతరించిపోతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను నాటకాలను కళాకారులను ఆదరిస్తూ భవిష్యత్ తరాల వారికి తెలియజేసే ప్రయత్నం చేస్తున్న కోనేటి సుబ్బరాజు గారికి హృదయపూర్వక అభినందనలు అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.

“శ్రీనివాస కళ్యాణం” కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు ఎం రాములు పాల్గొని ప్రసంగిస్తూ గోమాత విశిష్టతను తెలియజేసేలా నాటక ప్రదర్శనలు నిర్వహించాలని అందుకు తన వంతు సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు. బ్రిస్ హోటల్ అధినేత మబ్బు సూర్యనారాయణ రెడ్డి, రాయలసీమ రంగస్థలి కళాపోషకులు రాజా గుండాల గోపీనాథ్ రెడ్డి తిరుపతి ఆధ్యాత్మిక నగరంలో అనేక పౌరాణిక నాటకాలను ప్రోత్సహిస్తూ ప్రజల మన్ననలు పొందడం అభినందనీయం అన్నారు.

Related posts

విజయనగరంలో పోలీసులు అమరవీరుల సంస్మరణ ముగింపు

Satyam NEWS

లోక్ సభ స్పీకర్‌ తో ఎంపీ రఘురామకృష్ణరాజు భేటీ

Satyam NEWS

జగన్ మాట అలీ నోట

Satyam NEWS

Leave a Comment