39.2 C
Hyderabad
May 3, 2024 14: 32 PM
Slider హైదరాబాద్

పోలీసులు ఆపారని స్కూటీ కి నిప్పు

#Shamshabad Airport

ట్రాఫిక్ పోలీసులు తన స్కూటీ ఆపారని స్కూటీ యాజమాని స్కూటీకి నిప్పు పెట్టిన ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. స్కూటీ యాజమాని ఎండీ పసియుద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం .. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని కామన్ చెరువు పక్కనే ఉన్న తన ఇంటి నుంచి తన స్కూటీపై శంషాబాద్ లోని ఇంప్లాంట్ స్కూల్ నుంచి తమ బాబును తీసుకురావడానికి వెళుతూ ఉండగా ఎయిర్ పోర్డ్ బ్రిడ్జి కింద ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు స్కూటీని అడ్డగించి బలవంతంగా పక్కకు తీసుకెళ్లి స్కూటీ తాళాలు తీసుకొని,

పెండింగ్‌లో ఉన్న చలానాలు కట్టి స్కూటీ తీసుకెళ్లాలని బెదిరించడంతో గతంలో కూడా ఇలాగే ఇబ్బంది పెట్టారని, స్కూల్ కి వెళ్లాలని ఎంత బతిమిలాడినా స్కూటీ ఇవ్వకపోవడంతో ఆవేశానికి లోనై స్కూటీ పెట్రోల్ ట్యాంకర్ లో నిప్పు పెట్టానని తెలిపాడు. మంటలు ఎగిసిపడుతుండడంతో పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీసులు గమనించి నీటిని తెచ్చి పోయడంతో పెను ప్రమాదం తప్పింది.

శంషాబాద్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ ఎండీ పసియుద్దీన్ అనే వ్యక్తి తన స్కూటీపై నేషనల్ హైవే పై వెళుతుండగా అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ చలాన్ల ఎంక్వయిరీ చేయడంతో ఆ స్కూటీపై 28 చలానాలు

ఉన్నాయని మొత్తం 9 వేల రూపాయలు కట్టాల్సి ఉందన్నారు. 9 వేలలో కొంతైనా డబ్బులు కట్టాలని ట్రాఫిక్ పోలీసులు చెప్పడంతో స్కూటీ యజమాని ఆవేశానికి లోనై స్కూటీకి నిప్పు పెట్టుకున్నాడని తెలిపారు. అతనిని ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని ట్రాఫిక్ పెండింగ్ చలానాలు మాత్రమే కట్టండి అని అడగడం జరిగిందన్నారు.

Related posts

పోటాపోటీగా భగత్ సింగ్ వర్ధంతి…!

Satyam NEWS

అనంతపురం కలెక్టర్ గంధం చంద్రుడు బదిలీ

Satyam NEWS

కాంట్రవర్సీ: రాజధాని మార్చేందుకు కరోనా కుట్ర

Satyam NEWS

Leave a Comment