32.2 C
Hyderabad
May 12, 2024 20: 17 PM
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం నేడు జాతీయ క్రీడా దినోత్సవం

#Sportsday

శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెదపాడు గ్రామంలో నేడు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. వ్యాయామ ఉపాధ్యాయులు గుండ బాల మోహన్, కింజరాపు నరేష్ , హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ జె. శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ముందుగా సుప్రసిద్ధ భారతీయ హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ (1905, ఆగస్టు 29 – 1979, డిసెంబరు 3) చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ధ్యాన్ చంద్ భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పరిగణించదగిన 1928, 1932, 1936 ఒలంపిక్ క్రీడల్లో వరుసగా బంగారు పతకాలు సాధించి పెట్టాడని వారు తెలిపారు.

భారతదేశానికి ఒలింపిక్స్ లో హాకీ క్రీడలో బంగారు పతకాలను గెలుచుకొనివచ్చి, హాకీని జాతీయ క్రీడగా అభివృద్ధి చేసేందుకు విశేషంగా కృషి చేసిన వారిలో ముఖ్యలు మేజర్ ధ్యాన్‌చంద్ అని వారన్నారు.

Related posts

రక్తనిష్ట

Satyam NEWS

పల్లె, ప‌ట్ట‌ణ‌ ప్రగతి, హ‌రిత‌హారంపై దృష్టి పెట్టాలి

Satyam NEWS

స్థానికుల‌చే మొక్కలు నాటించిన విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment