27.7 C
Hyderabad
May 14, 2024 05: 09 AM
Slider కవి ప్రపంచం

రక్తనిష్ట

#Kondapally Niharini

తెల్లని ఆకసాన అరుణారుణ కాంతి పుంజాలు అరవిసిన

హృదయక్రాంతి  బింబ సాదృశ్యమవుతున్న వేళ ఇది!

లోలోపల నిజాల పొట్లాల్ని  ఒక్కొక్కటిగ 

ఆలోకన, అవలోకనాల నిప్పుల సాక్ష్యంగా విప్పుదాం.

ఆగని ఈ బ్రతుకు పయనపు పోరాటం

నిన్ను రాతియుగ తొలి మెళకువల నుండి,

లోహ వినియోగ మలి మెలకువ వరకు,

బ్రతుకు తాపడమయ్యేందుకు నడిపిస్తున్నది శ్రామిక శక్తి.

మహాశక్తి యుక్తై జగత్తంత వెలుగుదారులేసినట్టు,

తరగని కావ్యమొకటి  రాసిపెట్టుకుందాం.

ఇష్టపు చేతల,కాయకష్టపు చేతుల,

కనరాని తపనల కెరాటాలు అలవాటుగానే

మిత్రత్వాన్నికోరిన సత్యమంతా మేధస్సులకు తెలుసు.

ఉత్పత్తి జ్ఞానసముద్రం ముందు  ప్రపంచం మొత్తం వంచింది తల

గుండెసొరగుల దాచుకున్న గమనింపుల నిధి నిక్షేపమే ఇది!

పలుగూపారల పచ్చని చైతన్యం నిన్ను యంత్రవినియోగాల

ఆనంద డోలికల ఊగేందుకు మొదటి ఊపునిచ్చింది

సౌకర్యాల సందోహాలలో నిన్నొక మంత్ర నియంత్రణచేసింది

కదిలే రైలు వంక, నీవొక ఆశాపాశ మయినప్పుడు,

సమాంతర రేఖవైఖరై,
ఎగిరే పతాకాల వెనుక నీ దేశ రక్షక,

దేహ రక్షక దుర్భేద్యకవచాల ఆలోచనై, ఆచ్ఛాదనల,

అవసరాల గుచ్ఛమై, విచ్ఛేదనల సున్నిత సుందర సమాలోచనమై,

ఆకలి, నిద్రల సుఖాల వస్తువై,

ఆరోగ్యపరిరక్షక పదాతిదళమై, పనిచేసే

కార్మిక, కర్షక బృందాలకు పెట్టని కిరీటమే  మే ఒకటవ తేదీ తేజం!

“మే డే’’ దినోత్సవాన నువ్వూ ,నేనను భేదభావాల బరువుల క్రింద నలిగే

కంచెలన్నీ దాటి, కంటి చెలిమెలను ఈది,

వంచనల ఊచలన్నీ త్రుంచి, అంతరంగ సమార్థ్రత సారాన్ని గుండె నాళాలలో నింపుకొని

సోదర సంఘీభావ రక్తనిష్ట లో  చెమట విలువ తెలిసుకుందాం!  

మానవీయతా దృక్పథపు పథికులమౌదాం!

ప్రపంచ కార్మిక లోక పక్షాన పిడికిలి జెండానెత్తుదాం !

డా॥ కొండపల్లి నీహారిణి

Related posts

జనసంధ్రంగా విజయనగరం జొన్నగుడ్డి ఎల్లమ్మ జాతర…!

Satyam NEWS

మంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు

Satyam NEWS

స్ఫూర్తి నివ్వు

Satyam NEWS

Leave a Comment