38.2 C
Hyderabad
April 29, 2024 21: 22 PM
Slider నల్గొండ

డి ఎస్ ఆర్ ట్రస్ట్ చొరవతో నిలబడిన ప్రాణం

#BloodDonation

హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామానికి చెందిన ఇంజమూరి రవీందర్ అనారోగ్యంతో బాధపడుతూ కోదాడలో ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళాడు. అక్కడ డాక్టర్లు టెస్టులు చేసి బ్లడ్ తక్కువ ఉందని చెప్పడంతో రవీందర్ ఆందోళన చెందాడు. తనకు రక్తదానం ఎవరు చేస్తారా అని ఆలోచించాడు.

అయితే ఈ లోపు హుజూర్ నగర్ లో ఉన్న డిఎస్ఆర్ ట్రస్ట్ వారిని సంప్రదించగా వారు వెంటనే స్పందించి హుజూర్ నగర్ పట్టణానికి చెందిన మేరిగ గోపి తో బి పాజిటివ్ బ్లడ్ ఇప్పించారు. ఈ సందర్భంగా డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు  మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ  రక్తదానం చేయాలని, మరొకరికి ప్రాణదాతలు కావాలని, ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేద్దాం మానవత్వాన్ని చాటుదాం అన్నారు.

మేరిగ గోపికి డి యస్ ఆర్ ట్రస్ట్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. హుజూర్ నగర్ లో బ్లడ్ బ్యాంకును ఏర్పాటు చేయాలని గతంలో సూర్యాపేట జిల్లా కలెక్టర్ సురేందర్ మోహన్ కలసి వినతి పత్రం ఇచ్చామని అన్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రధాన కేంద్రంలో  వంద పడకల వైద్యశాలకు ఏడు మండలాల  నుంచి  శుక్రవారం, మంగళవారం  వచ్చే గర్భిణీ స్త్రీలు 150 నుంచి 200 మంది వస్తుంటారని, డెలివరీ సమయంలో కూడా బ్లడ్ బ్యాంక్ లేకపోవడం వల్ల కొందరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో నూక తోటి ప్రమోద్ కుమార్, మామిడి రాజేష్, మామిడి అశోక్ కుమార్ ,కోల్లపూడి కళ్యాణ్, దగ్గుపాటి సురేష్, కోలపూడి ప్రేమ్, చందు ,దగ్గుపాటి రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గురుకుల పాఠశాల తరలింపు అన్యాయం

Satyam NEWS

పరమశివుని ఆశీస్సులు ప్రతీ ఒక్కరిపై ఉండాలి

Satyam NEWS

జనాభా నియంత్రణ పాటిస్తేనే మానవ జాతికి మనుగడ

Satyam NEWS

Leave a Comment