28.7 C
Hyderabad
May 5, 2024 10: 06 AM
Slider గుంటూరు

డబ్బులు పంచే వాళ్లే ఓటర్లను విమర్శిస్తున్నారు

#navataramparty

ఓట్లకు డబ్బులు పంచే ప్రధాన రాజకీయ పార్టీలే ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారని విమర్శించడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుందని నవతరంపార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల వ్యవస్థను భ్రష్టు పట్టించిన ఘనత దేశంలో డబ్బులు పంచే రాజకీయ పార్టీలకు దక్కుతుంది అని ఓటర్లు డబ్బులు తీసుకుంటున్నారని విమర్శించే హక్కు ఆయా రాజకీయ పార్టీలకు లేదని అయన అన్నారు.

మంగళగిరి నవతరం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా నేడు ఆయన పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం కేకు కోసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హింసలో దేశంలో ప్రథమ స్థానం తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుంది అన్నారు. పోలీసులు కాళ్ళు చేతులు కదాలనివ్వకుండా లాఠీని, చట్టాన్ని తమచేతుల్లోకి వైస్సార్సీపీ నేతలు తీసుకుంటున్నారని విమర్శించారు.

పోలీసు వ్యవస్థ కు స్వతంత్ర ప్రతిపత్తి ఉండాలి అన్నారు. గవర్నర్ వ్యవస్థ కింద పోలీసు శాఖ ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలో అన్నీ రాష్ట్రాల్లో గవర్నర్ కింద పోలీసులు పనిచేసేలా చట్టం అమలుకు నవతరంపార్టీ డిమాండ్ చేస్తుందన్నారు. నవతరంపార్టీ రానున్న ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలను గురించి సమావేశం జరిగింది. వ్యక్తిగతంగా నేతలతో రావుసుబ్రహ్మణ్యం 3 గంటల పాటు చర్చించారు.

ఎన్టీఆర్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు యనమండ్ర కృష్ణ కిషోర్ శర్మ,రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుల్లా రవి,గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెల్లాల సాయి,రాష్ట్ర నేత మురళీ కృష్ణ, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ రజాక్,బత్తుల శ్రీనివాస్, సులేమన్, షేక్ బాజి మరియు  ముఖ్య నేతలు హాజరయ్యారు.

Related posts

నకిలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా అరెస్టు

Satyam NEWS

రాజంపేట టీడీపీలోకి వైసీపీ, జనసేన నేతల వలసలు

Satyam NEWS

జలకళ సంతరించుకున్న పోల్కి చెరువుకు పూజలు

Satyam NEWS

Leave a Comment