30.7 C
Hyderabad
May 5, 2024 03: 30 AM
Slider ప్రత్యేకం

నూతన భవనంలోకి మారుతున్న యూఎస్‌ కాన్సులేట్‌

#uscounsulate

యూఎస్ కాన్సులేట్ తమ కార్యకలాపాలను ఈ నెల 20 నుంచి నానక్‌రామ్‌గూడ లోని నూతన భవనం నుంచి ప్రారంభించనుంది. 340 మిలియన్ డాలర్ల పెట్టుబడితో ఈ అత్యాధునిక భవనం నిర్మించారు. ప్రస్తుతం ఉన్న బేగంపేట్‌ పైగా ప్యాలెస్‌లో ఈ నెల 15 వరకు సేవలు కొనసాగనున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి 20వ తేదీ 8.30 గంటల వరకు కార్యకలాపాలను నిలిపివేస్తున్నామని కాన్సులేట్ జనరల్‌ వెల్లడించింది. మార్చి 20 ఉదయం 08:30 వరకు అత్యవసర సేవలకు అమెరికా పౌరులు, +91 040-4033 8300 నంబర్‌పై సంప్రదించాలని యూఎస్ కాన్సులేట్ కోరింది. మార్చి 20 ఉదయం 08:30 తర్వాత, అత్యవసర సేవలకు అమెరికా పౌరులు 91 040 6932 8000 నంబర్‌పై సంప్రదించాలని తెలిపింది. అత్యవసరం సేవలకు అమెరికా పౌరులు HydACS@state.gov కి ఈ- మెయిల్‌ కూడా చేయవచ్చని పేర్కొంది.

మార్చి 15 వరకు వీసా ఇంటర్వ్యూ ఉన్న దరఖాస్తుదారులు బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌లో సంప్రదించాలని, మార్చి 23 నుండి వీసా దరఖాస్తుదారులు ఇంటర్వ్యూ కోసం నానక్‌రామ్‌గూడలోని నూతన కార్యాలయానికి వెళ్లాలని కాన్సులేట్ జనరల్‌ సూచించింది. బయోమెట్రిక్స్ అపాయింట్‌మెంట్‌లు, “డ్రాప్‌బాక్స్” అపాయింట్‌మెంట్‌లు (ఇంటర్వ్యూ మినహాయింపు ఉన్నవారు), పాస్‌పోర్ట్ పికప్‌ సహా ఇతర వీసా సేవలు – లోయర్ కాంకోర్స్, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్, మాధాపూర్, హైదరాబాద్‌ 500081, లో ఉన్న వీసా అప్లికేషన్ సెంటర్ లో కొనసాగుతాయి. కాన్సులేట్ మార్పు ప్రక్రియ వల్ల వీసా అప్లికేషన్ సెంటర్ సేవలపై  ఎలాంటి ప్రభావం ఉండదని కాన్సులేట్ జనరల్‌ వివరించింది. వీసా సేవలకి సంబంధించి మీకేమైనా సందేహాలుంటే, +91 120 4844644, +91 22 62011000పై కాల్ చేయాలి. నానక్‌రామ్‌గూడ కాన్సులేట్ బదిలీ సమాచారం కోసం కాన్సులేట్ సోషల్ మీడియా అకౌంట్లను ఫాలో అవ్వాలని కాన్సులేట్ జనరల్  పేర్కొంది. Twitter (@USAndHyderabad), Instagram (@USCGHyderabad), Facebook (@usconsulategeneralhyderabad)

Related posts

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు

Sub Editor

చంద్రగ్రహణం కారణంగా కాణిపాకం ఆలయం మూసివేత

Bhavani

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకుందాం

Satyam NEWS

Leave a Comment