31.7 C
Hyderabad
May 6, 2024 23: 24 PM
Slider హైదరాబాద్

రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కాపాడుకుందాం

#AIDWA

భారత రాజ్యాంగం నిర్దేశించిన లౌకిక, ప్రజాస్వామిక, సామ్యవాద విలువల హక్కులను కాపాడుకోవాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు.

రాజ్యాంగము కల్పించిన హక్కులను అణచివేసేందుకు జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా మనం మేల్కొనకపోతే-మనం నిలబడక పోతే హక్కులు హరించి వేస్తారని, హక్కులను రక్షించుకోవడానికి, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజల తరఫున ఉద్యమించడానికి పూను కుంటామని ఐద్వా, ఎన్ఎఫ్ఐ డబ్ల్యూ, పి.ఓ. డబ్ల్యు, సి .ఎం .ఎస్. సంఘాల ఆధ్వర్యంలో శనివారం ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహానికి పూల మాలవేసి ప్రతిజ్ఞ చేశారు.

అనంతరం ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి,  ఎన్.ఎఫ్. ఐ. డబ్ల్యు  కృష్ణకుమారి, పీఓడబ్ల్యూ సంధ్య, ఐద్వా జాతీయ నాయకులు టీ. జ్యోతి మాట్లాడుతూ దేశంలో ఎవరైతే ప్రజల కోసం సహజ వనరుల కోసం పౌర హక్కులను అడిగే వారిని, ప్రభుత్వాన్ని విమర్శించే వారి పై తప్పుడు కేసులు బనాయించి జైల్లో నిర్బందిస్తున్నారని విమర్శించారు.

 సామాజిక కార్యకర్తలను కూడా నిర్బందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఫాసిస్టు విధానాలకు వ్యతిరేకంగా రాసినందుకు గౌరీ లంకేష్ ను హత్య చేశారని అన్నారు. దేశంలో ఉన్న సహజ వనరులైన బొగ్గు, గనులు, నదులు, అడవులను మరియు భూములను నాశనం చేస్తూన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోపక్క ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తున్నారని అన్నారు. మహిళలపై రోజురోజుకు హింస పెరుగుతున్నదని వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు.

ప్రజా హక్కుల పై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి ఉద్యమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు లక్ష్మమ్మ, స్వర్ణలత, పద్మ ,విమల, భవాని, శివాని, అశ్విని తదితరులు పాల్గొన్నారు.

Related posts

బీజేపీ అగ్రనేతలను కలిసిన కెవిఆర్

Satyam NEWS

కురుమ, యాదవులను దగా చేస్తున్న కేసీఆర్

Satyam NEWS

బీజేపీ ని దేశమంతటా చిత్తుగా ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి

Bhavani

Leave a Comment