27.7 C
Hyderabad
April 26, 2024 06: 00 AM
Slider ఆంధ్రప్రదేశ్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు

ap cs Nilam Sahini

రాష్ట్రంలో కరోనా కేసులు ఉన్న దృష్ట్యా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని ఏపీ సీఎస్‌ నీలం సాహ్నిస్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.

‘కరోనా కట్టడికి రాష్ట్రాలు వాటి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. ఏపీని ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదు. చలికాలంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్రం హెచ్చరించింది.

ఏపీలో 6,890మంది కరోనా వల్ల మృతి చెందారు. మరోసారి కరోనా ప్రబలేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ ప్రాంతాలకు కరోనా వ్యాపించే ప్రమాదముంది. ఇప్పటికే పరిపాలన సిబ్బంది, పోలీస్‌ సిబ్బంది, వివిధశాఖల ఉద్యోగులు కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు.

స్థానిక సంస్థల నిర్వహణకు పరిస్థితి అనుకూలించిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఎన్నికల నిర్వహణపై సమాచారం ఇస్తుంది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం, భద్రత దృష్ట్యా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. ఎన్నికల నిర్వహణపై మీ నిర్ణయాన్ని పునరాలోచన చేయాలి. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నట్టు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వీడియో కాన్ఫరెన్స్‌ అవసరం లేదని మేము భావిస్తున్నాం’ అని సీఎస్‌ లేఖలో పేర్కొన్నారు.

Related posts

పెట్రోల్, డీజిల్ బహిరంగ దోపిడీకి నియంత్రణ లేదా

Satyam NEWS

27 రకాల దళిత సంక్షేమ పథకాలను ఎందుకు ఎత్తివేసారో చెప్పగలరా?

Satyam NEWS

ఈశాన్య రాష్ట్రానికి కొత్త గ‌వ‌ర్న‌ర్ గా తెలుగు వాడు

Satyam NEWS

Leave a Comment