28.7 C
Hyderabad
May 6, 2024 09: 04 AM
Slider హైదరాబాద్

డా. ఈడ్పుగంటి పద్మజా రాణికి తెలంగాణ ప్రభుత్వం సన్మానం

#padmajarani

మహిళలకు ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ ఉత్సవాలు జరుపుకునే రోజులు రావాలని ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు ఆకాంక్షించారు. మహిళలను, అమ్మాయిలను గౌరవించే సంస్కారం అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే నేర్పాలని తల్లిదండ్రులకు సూ చించారు. సమాజంలో మహిళలపై జరిగే దాడులు, అకృత్యాలను పిల్లల పెంపంకంలోని లోటుపాట్లు కూడా ప్రభావితం చేస్తాయని చెప్పారు.

మంగళవారం హైదరాబాద్‌ పీపుల్స్‌ప్లాజాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 138 మంది మహిళా జర్నలిస్టులకు మంత్రులు కేటీఆర్‌, జగదీశ్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌, సీఎస్‌ శాంతికుమారి చేతుల మీదుగా సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా జర్నలిస్ట్ , తెలంగాణ తొలి మహిళా వాస్తు,జ్యోతిష్య శిఖామణి, 21 డిగ్రీలు పొందిన విద్యావేత్త, డాక్టర్ ఈడ్పుగంటి పద్మజా రాణికి ,పలువురు మహిళా జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రశంసాపత్రం అందజేశారు. మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ ల సమక్షంలో సన్మాన పత్రం అందజేయడం విశేషం. ఈ కార్యక్రమంలో ప్రత్యేకంగా ఈడ్పుగంటి పద్మజా రాణి గురించి, ఆమె ప్రత్యేకత గురించి వేదికపై ప్రస్తావించగానే ఒక్కసారిగా కార్యక్రమానికి వచ్చిన వారి కరతాళ ధ్వనులతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది.

తనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వానికి పద్మజా రాణి కృతజ్ఞతలు తెలిపారు. మహిళాభివృద్ది కోసం తనవంతు కృషి ఎప్పటికీ చేస్తూనే ఉంటానని అన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, ఎమ్మెల్యేలు షకీల్‌ అహ్మద్‌, కోరుకంటి చందర్‌, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌, ఐఅండ్‌ పీఆర్‌ డైరెక్టర్‌ రాజమౌళి, అడిషనల్‌ డైరెక్టర్‌ నాగయ్య, కిశోర్‌బాబు, జాయింట్‌ డైరెక్టర్‌లు జగన్‌, శ్రీనివాస్‌, కే వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధుసూదన్‌, వెంకటేశ్వర్లు, ఎస్‌ఏ హష్మి తదితరులు పాల్గొన్నారు.

ఈడుపుగంటి పద్మజారాణి విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలిమహిళా  జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగకర్తగా పేరు పొందారు. డా. భాస్కర్ భట్ జోషి మార్గదర్శకత్వంలో  స్టడీ ఆన్ బ్లెండెడ్ ఎఫెక్ట్ అఫ్ ఆస్ట్రాలజీ వాస్తు ఆన్ ఇండివిడ్యువల్ డెస్టినీ అనే అంశంపై శాస్త్ర ఫ్యాకల్టీ నుండి జ్యోతిష్య శాస్త్రంలో కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం, బెంగళూరు నుండి విద్యావారధి (పి.హెచ్ డి) సాధించారు. ఈ ఘనత సాధించిన ప్రధమ రాష్ట్రేతర మహిళ. యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాల నుంచి జ్యోతిష, వాస్తు శాస్త్రంలో డబల్  పోస్టుగ్రాడ్యుయేషన్స్, డబుల్ పోస్టుగ్రాడ్యుయేషన్ డిప్లమో, పీహెచ్ డీ సాధించారు.

M.A (జ్యోతిష్యం మరియు వాస్తు)లో తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్, యూనివర్సిటీ టాపర్, M.A (ఫలిత జ్యోతిష్యం ) నేషనల్  సంస్కృత  యూనివర్సిటీ  తిరుపతి లో డిస్టింక్షన్, మెడికల్ ఆస్ట్రాలజీలో (గోల్డ్ మెడలిస్ట్), జ్యోతిష్యం ఇంజనీరింగ్ వాస్తు లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ల్లో యూనివర్సిటీ ర్యాంకర్, జ్యోతిష్యం మరియు వాస్తు రిసోర్స్ పర్సన్, స్వర్ణ కంకణం, జ్యోతిష్య కాలమిస్ట్, క్యాలెండర్ మరియు పంచాంగ రచయిత గా ఆమె ఎనలేని ఖ్యాతిని ఆర్జించారు. ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియాలో దాదాపు 14 సంవత్సరాలుగా కాలమిస్ట్ , పంచాంగ శ్రవణం నిర్వహించడమే కాకుండా పంచాంగ కర్త గా ప్రాచుర్యం పొందారు. 

జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆమె చేస్తున్న కృషికి జ్యోతిర్వాస్తూ, విద్యా రంగాలలో ఒక ప్రముఖ మహిళ గా అగ్ర స్థానం పొందారు. 9 సార్లు ఇండియా బుక్  అఫ్ రికార్డ్స్ లో, 2 సార్లు యూనిక్ వరల్డ్ రికార్డ్స్ లో, ఇంటర్నేషనల్  బుక్ అఫ్ రికార్డ్స్ లో 27 అంశాలలో  మొదటి మహిళగా  నమోదు అయ్యారు.

భరతముని, వంశీ వేద ఉగాది  పురస్కారం, అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ముంబైలోని IAWA NGO, అమర్ సినీ ప్రొడక్షన్స్ ద్వారా సరస్వతీ బాయి దాదాసాహెబ్ ఫాల్కే (SDP) ఇంటర్నేషనల్ ఐకానిక్ ఉమెన్ అవార్డు, బ్లిస్‌ఫుల్ క్వీన్స్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ 2022 ముంబై, టాప్ 100 ప్రభావవంతమైన మహిళా అంతర్జాతీయ ప్రముఖ వేద జ్యోతిష్కురాలిగా అవార్డులు దక్కించుకున్నారు.

మొదటి మహిళా తెలుగు రచయితగా మరియు పంచాంగ్ (పంచాంగం) పఠించే వ్యక్తిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రవేశించారు. ప్రజా డైరీ పత్రిక వారి  21వ  వార్షికోత్సవ సంవత్సరం సందర్భంగా సెలబ్రిటీ అవార్డు, ప్రైడ్ అఫ్ ఇండియా, వివేకానంద జాతీయ పురస్కారం  వంటి దాదాపు 500పైన అవార్డులు పొందారు.

Related posts

వామ్మో ఇదేంటి? : టీఆర్ ఎస్ నేతల తిట్ల దండకం

Satyam NEWS

కోవిడ్ 19 ఎదుర్కొనడానికి సర్పంచ్ లు ముందుకు రావాలి

Satyam NEWS

ధిక్కరించిన అధికారిపై వేటు వేసిన నిమ్మగడ్డ

Satyam NEWS

Leave a Comment