శ్రీకాకుళం రూరల్ మండలం పెదపాడు గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 2020 నూతన సంవత్సర దినోత్సవ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మట్కా శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు నూతన సంవత్సర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులతో బాటు పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయులు అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు పి. సత్యవతి, ఎస్. వి .కృష్ణారావు, ఎం. శాంతారావు, జి.భూషణం రావు, డి .ఎం. మల్లేశ్వరి, కె సురేష్ కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు గుండ బాల మోహన్, బీ త్రివేణి, సిహెచ్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.