38.2 C
Hyderabad
May 5, 2024 19: 41 PM
Slider గుంటూరు

NH167/A రహదారి మార్గాన్ని మార్చాలి

చీరాల ఓడరేవు నుండి నకరికల్ వరకు రోడ్డు విస్తరణ లో భాగంగా కేసానుపల్లి ఎల్ టి నగర్ నుండి జొన్నలగడ్డ, గుంట గార్లపాడు, రావిపాడు పొలాల గుండా నకరికల్లు పోవు రహదారిని మార్చాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంచి పంటలు పండే భూములని నరసరావుపేట మునిసిపల్ పరిధిలోకి విలీనం చేసిన గ్రామాలలో ప్రస్తుత మార్కెట్ ధర రెండున్నర కోట్ల నుండి ఐదు కోట్ల రూపాయల వరకు ధర పలుకుతుందని, ఈ బైపాస్ రోడ్డును మరొక ప్రక్కకు మార్చితే ఎక్కువ ప్రభుత్వ భూములు గుండా పోవచ్చునని రైతులు కోరుతున్నారు.

బాధిత రైతులు నరసరావుపేట లోని కోట సెంటర్ నుండి జిల్లా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించి కలెక్టర్ కి వ్యక్తిగత అభ్యంతరాలతో అర్జీలను ఇచ్చారు. కలెక్టర్ మాట్లాడుతూ బాధిత రైతులతో త్వరలోనే మరొక సమావేశం ఏర్పాటు చేస్తానని వ్యక్తిగత అర్జీలు అన్నింటిని పరిశీలించి రైతులకు న్యాయం చేస్తానని చెప్పారు. ఆ తరువాత బాధిత రైతులను ఉద్దేశించి కౌలు రైతుల సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు మాట్లాడుతూ రైతుల అనుమతి లేకుండా రైతుల పొలాలు సర్వే చేసి రాళ్లు పాతటం దుర్మార్గమన్నారు. బాధిత రైతులంతా పార్టీలకతీతంగా ఈ సందర్భంలో ఐక్యంగా ఉండాలని, ప్రభుత్వం సేకరించాలనుకున్న భూమి కొరకు 2013 భూసేకరణ చట్ట ప్రకారం గ్రామసభలు జరిపి 70 శాతం ఆమోదం పొందాలన్నారు. నరసరావుపేట మునిసిపాలిటీలోకి విలీనం చేసిన పరిధిలో గుండా బైపాస్ వేయటం సరైంది కాదని మునిసిపాలిటీ పరిధికి వెలుపల వేయాలన్నారు.

బైపాస్ కింద పోయే భూముల మార్కెట్ ధర 5 కోట్ల దాకా ఉందని అదే భూమికి ప్రభుత్వ ప్రకటించిన రిజిస్ట్రేషన్ విలువ 15 లక్షలు మాత్రమేనని దీనిని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి న్యాయం చేయాలని కోరారు. నల్లమడ రైతు సంఘం నాయకులు కొల్ల రాజమోహన్ మాట్లాడుతూ రైతుల భూములు కు తక్కువ నష్టం కలిగే విధంగా రోడ్లను నిర్మించాలని, విదేశాల్లో ఉపయోగిస్తున్న టెక్నాలజీని ఇక్కడ ఎందుకు ఉపయోగించరని అలాంటి టెక్నాలజీతో తక్కువ విస్తీర్ణంలోనే రహదారుల నిర్మాణం చేయొచ్చని చెప్పారు. పిడిఎం నాయకులు నల్లబాటి రామారావు మాట్లాడుతూ ఇందులో తాను ఒక బాధితుడినే అని మనమంతా ఐక్యంగా ముందుకు పోదామన్నారు. ఈ కార్యక్రమంలో కేసానుపల్లి, జొన్నలగడ్డ, గుంత గార్లపాడు, ఇషప్పాలెం, రావిపాడు తదితర గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Related posts

కాళేశ్వరంతో ఆయిల్ పామ్ తోటలకు అనువుగా మారిన తెలంగాణ

Satyam NEWS

`ఓదెల రైల్వేస్టేషన్`లో `స్పూర్తి`గా పూజిత పొన్నాడ‌ లుక్ విడుద‌ల‌

Satyam NEWS

వృద్ధ దంపతులకు సహాయం చేసిన Rti24 news

Satyam NEWS

Leave a Comment