36.2 C
Hyderabad
April 27, 2024 21: 40 PM
Slider వరంగల్

వృద్ధ దంపతులకు సహాయం చేసిన Rti24 news

#mulugudist

ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం ఇంచేం చెర్వుపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న పసునూటి యాకయ్య, సంభలక్ష్మి దంపతుల ఇల్లు దురదృష్టవశాత్తు కాలిపోయింది. వారికి రాత్రి కనీసం ఉండేందుకు షెల్టర్ కూడాలేదు. నిన్న మధ్యాహ్నం స్థానికులు బ్లాంకిట్స్ అవి ఇచ్చినా కానీ పడుకోవడానికి స్థలం లేక చెట్టు కిందనే ఉన్నారు. ఆ దంపతుల విషయాన్ని గ్రామస్థుడు అశోక్ ద్వారా సురేందర్, అన్వేషన్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టారు. పూర్తి వివరాలు తెలుసుకుని ఈరోజు మధ్యాహ్నం RTI24న్యూస్ హన్మకొండ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చిలువేరు కరుణాకర్ వృద్ధుల వద్దకు వెళ్లి వారికి బట్టలు, బ్లాంకిట్స్, వంట సామాను, తినడానికి అవసరం అయ్యే సరుకులు అన్ని ఇచ్చారు. అలాగే వారు కుటుంబ సభ్యులతో అక్కడే వారితో కలిసి భోజనం చేసి వారికి తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది.

నిన్న రాత్రి సమాచార హక్కు రక్షణ చట్టం కార్యకర్తలు, సన్నిహితుల  ద్వారా డబ్బు రూపంలో  17000/-  వరకు సహాయం చేసారు. ఆ డబ్బులను వారి అకౌంట్ లో  వేయడానికి చూడగా బ్యాంక్ పాస్ బుక్ కాలిపోవడం తో బ్యాంక్ మేనేజర్ తో మాట్లాడి సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు రక్షణ చట్టం వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్, హన్మకొండ జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రియాంక RTI కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ప్రాణాల‌కు తెగించి ప‌ని చేస్తున్న మీడియా మిత్రులు

Satyam NEWS

డీఎస్సీ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

Bhavani

బిల్లులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తారా..?

Satyam NEWS

Leave a Comment