25.2 C
Hyderabad
May 13, 2024 10: 31 AM
Slider ముఖ్యంశాలు

మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష ను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఎ

#NIA arrested

మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో శిరీష తన నివాసంలో ఉండగా ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి ఆమెను అరెస్ట్ చేసి తరలించారు.

ఇటీవలే శిరీష ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే సోదాలు జరిగే సమయంలో శిరీష ఇంట్లో లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లి వచ్చే లోపు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారని శిరీష అప్పట్లో మీడియాకు తెలియజేశారు.

భర్త, కుమారుడిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉండగా విచారణ సోదాలు అంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులకు నగదు పంపించినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని శిరీష అప్పట్లో తెలిపారు.

Related posts

వైజాగ్ ట్రాజెడీ: యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం

Satyam NEWS

మధ్యప్రదేశ్ లో ఎన్నికల సన్నాహాలు: భారీగా పోలీసు బదిలీలు

Bhavani

ఆషాఢమాసం బోనాలు

Satyam NEWS

Leave a Comment