24.7 C
Hyderabad
March 26, 2025 10: 46 AM
Slider ఆంధ్రప్రదేశ్

వైజాగ్ ట్రాజెడీ: యాజమాన్యం నిర్లక్ష్యమే కారణం

#LG Polymers Vizag

విశాఖపట్నంలో విషవాయువు ప్రమాదానికి ఎల్‌జీ పాలిమర్స్‌ యాజమాన్య నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. లాక్‌డౌన్‌లోనూ పరిశ్రమలో ప్రతిరోజు మెయింటెనెన్స్‌ చేయాల్సి ఉన్నప్పటికీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ ఉన్నకారణంగా మెయింటెనెన్స్‌ కోసం ప్రభుత్వం పాస్‌లు కూడా ఇచ్చింది. 45 మందికి మెయింటెనెన్స్‌ పాస్‌లు ఇచ్చినప్పటికీ యాజమాన్యం మెయింటెనెన్స్ పై నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఇప్పుడు మరో సారి విషవాయువు వెలువడటానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా చెబుతున్నారు. పరిశ్రమ ట్యాంకుల్లో దాదాపు 2 వేల మెట్రిక్‌ టన్నుల స్టైరెన్‌ను నిల్వ చేసింది.

అక్కడ 20 డిగ్రీల లోపు ఉష్ణోగ్రత ఉంచడంలో ఫ్యాక్టరీ యాజమాన్యం విఫలమైంది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో.. స్టైరెన్‌ లీక్‌ అయి మంటలు చెలరేగాయి. దీంతో ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలకు స్టైరెన్‌ గ్యాస్‌ వేగంగా వ్యాప్తి చెందింది. కాగా, గురువారం తెల్లవారుజామన చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందగా, దాదాపు 200 మంది అస్వస్థతకు లోనయ్యారు.

Related posts

చదువుతో పాటు క్రీడలు ఉంటేనే విద్యార్థులు మానసికంగా రాణిస్తారు

mamatha

మంత్రి హరీష్ రావుకు శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ శ్రేణులు

Satyam NEWS

ఒంగోలు నగరంలో ‘‘బాబుతో నేను’’

mamatha

Leave a Comment