27.7 C
Hyderabad
May 4, 2024 08: 11 AM
Slider జాతీయం

మధ్యప్రదేశ్ లో ఎన్నికల సన్నాహాలు: భారీగా పోలీసు బదిలీలు

వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లబోతున్న మధ్యప్రదేశ్ లో పోలీసు శాఖలో భారీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఇందులో భాగంగా 23 జిల్లాల ఎస్పీలు మారనున్నారు. దీంతో పాటు 50 మందికి పైగా ఏఎస్పీ, డీఎస్పీ, పలువురు ఐజీ-డీఐజీలు కూడా పదోన్నతిపై బదిలీ కానున్నారు. అయితే బదిలీలకు కారణం ఎన్నికలు కాదని మూడు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారినే బదిలీ చేస్తున్నామని ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఇదే కాకుండా ఎంతో మంది పోలీసు అధికారులకు ప్రమోషన్లు కూడా ఇవ్వాల్సి ఉన్నందున బదిలీలు తప్పనిసరి అని చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో గెలిచేందుకే ఈ పని చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నది. ఇవన్నీ కేవలం సాకులు మాత్రమేనని, నిజానికి ఎన్నికలకు ముందు బీజేపీ ప్రభుత్వం తనకు ఇష్టమైన అధికారులను తమకు కష్టమైన ప్రదేశాలలో నియమించుకుంటున్నదని కాంగ్రెస్ పేర్కొంది.

కొత్త ఎస్ పి ల జాబితా ఈ విధంగా ఉంది.
ధర్ ఎస్పీ ఆదిత్య ప్రతాప్ సింగ్
హర్దా ఎస్పీ మనీష్ అగర్వాల్
గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ
సింగ్రౌలి ఎస్పీ వీరేంద్ర సింగ్
జబల్‌పూర్ ఎస్పీ సిద్ధార్థ్ బహుగుణ,
అగర్ ఎస్పీ రాకేష్ కుమార్ సాగర్,
బుర్హాన్‌పూర్ ఎస్పీ రాహుల్ కుమార్ లోధా
బేతుల్ ఎస్పీ సిమల ప్రసాద్
దేవాస్ ఎస్పీ శివదయాళ్,
ఖాండ్వా ఎస్పీ వివేక్ సింగ్
ఛతర్‌పూర్ ఎస్పీ సచిన్ శర్మ
భోపాల్ డిసిపి సాయి కృష్ణ తోట,
దాటియా ఎస్పీ అమన్ రాథోడ్

అదే విధంగా చింద్వారా ఎస్పీ వివేక్ అగర్వాల్, నార్సింగ్‌పూర్ ఎస్పీ విపుల్ శ్రీవాస్తవ డిప్యూటేషన్‌పై కేంద్రానికి వెళ్లనున్నారు. అందుకే వారి స్థానంలో కొత్త సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌కి జిల్లాల కమాండ్‌ కూడా ఇవ్వనున్నారు.
పదోన్నతి పొందిన IPS అధికారులకు ఫీల్డ్ పోస్టింగ్ ఇస్తున్నారు. కొందరు ఎస్పీ స్థాయి పోలీసు అధికారులకు పదోన్నతి లభించడంతో వారికి కూడా కొత్త పోస్టింగ్‌లు దక్కనున్నాయి.

రేవా ఎస్పీ నవీన్ భాసిన్,
సాగర్ ఎస్పీ తరుణ్ నాయక్,
డైరెక్ట్ ఎస్పీ ముఖేష్ శ్రీవాస్తవ,
ఉజ్జయిని ఎస్పీ సత్యేంద్ర శుక్లా
విదిశా ఎస్పీ మోనికా శుక్లా,
కట్ని ఎస్పీ సునీల్ కుమార్ జైన్,
రాజ్‌గఢ్ ఎస్పీ అవధేష్ గోస్వామి,

ట్రాఫిక్ డీసీపీ మహేంద్ర చంద్ర జైన్ పదోన్నతి తర్వాత డీఐజీ అవుతారు. బదిలీల జాబితాను హోంశాఖ సిద్ధం చేసింది. కేవలం ఆర్డర్ విడుదల ఆలస్యం అవుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు శివరాజ్ ప్రభుత్వం తనకు ఇష్టమైన అధికారులకు ఇష్టారాజ్యంగా పోస్టింగ్‌లు ఇస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది.

Related posts

శ్రీశైలం దేవస్థానాన్ని కొల్లగొట్టిన సిబ్బందికి ఉచ్చు

Satyam NEWS

బాలీవుడ్ నటి కృతి సనన్ తో ప్రభాస్ ఎఫైర్?

Satyam NEWS

రాజంపేట జిల్లా సాధన కోసం రాజీనామా లు చేస్తామన్న వైసీపీ నేతలు

Satyam NEWS

Leave a Comment