34.2 C
Hyderabad
May 14, 2024 22: 31 PM
Slider ఆధ్యాత్మికం

అన్నదానంలో అక్రమాలు చోటు చేసుకోలేదు

#mangalagiri

మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానంలో ప్రతిరోజు జరుగుతున్న అన్నదానంలో 12 వేల రూపాయలు పక్కదారి పట్టిస్తున్నారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన విమర్శలపై బుధవారం ఆలయ ఈవో అన్నపరెడ్డి రామకోటి రెడ్డి స్పందించారు. తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ  గత జనవరి నెలలో 2,650  మందికి భోజనం పెట్టామని ప్లేటుకు రూ. 30 చొప్పున ఖర్చు చేశామని అన్నారు. తన వద్దకు వస్తే లెక్కలు చూపిస్తానని పేర్కొన్నారు.

పెద్ద కోనేరు పనుల నిర్వహణల తో తమకు సంబంధం లేదని ఇంజనీరింగ్ విభాగం వారు ఆ పనులు చేస్తారని తెలిపారు. ఉద్యోగుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నందున కొందరు తనపై పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్ 10న హైకోర్టు న్యాయమూర్తి  కుటుంబంతో పూజలు చేసేందుకు  దేవస్థానానికి వచ్చారని ఆ సందర్భంలో కళ్యాణ్ అనే ఉద్యోగి కొంత అవగాహన లేక వారిని కొద్దిసేపు వేచి ఉండాలని చెప్పినట్లు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని ప్రోటోకాల్ సిబ్బంది  తన దృష్టికి తీసుకు వచ్చిన నేపథ్యంలో సదరు ఉద్యోగి పై చర్యలు తీసుకోవాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారని అన్నారు. అయినప్పటికీ తాను మానవతా దృక్పథంతో చర్యలకు ఉపక్రమించలేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తాను ఆ ఉద్యోగి చేత కాళ్లు పట్టించుకున్నట్లు ఆరోపణలు చేయడం సరి కాదని అన్నారు. ఇదే విషయమై కళ్యాణ్ అనే ఉద్యోగి మాట్లాడుతూ తాను ఈవో రామకోటిరెడ్డి కాళ్లు పట్టుకున్నట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని తమను ప్రశాంతంగా ఉద్యోగాలు చేసుకొని ఇవ్వాలని రాజకీయ వ్యవహారాల్లోకి తమను లాగొద్దని కోరారు.

రెండు అదనపు హుండీలను ఏర్పాటు చేశా

అర్చకుల నుండి మీరు ప్రతి నెల పెద్ద మొత్తంలో మామూళ్ళు తీసుకోవడం వల్లనే ప్లేట్ కలెక్షన్స్ ను నియంత్రించలేకపోతున్నారని, దీనివల్ల ఆలయ ఆదాయానికి గండిపడుతోందంటూ వస్తున్న విమర్శలపై ఆలయ ఈవో ను ప్రశ్నించగా అటువంటిదేమీ లేదని అన్నారు. తాను ఇప్పటికే ఎక్కువ దిగువ సన్నిధిలో రెండు అదనపు హుండీలను ఏర్పాటు చేశానని అన్నారు. ఒకవేళ తాను మామూళ్ళు తీసుకుంటే హుండీలను ఏర్పాటు చేయను కదా అని తెలిపారు.

సాంబ,జర్నలిస్ట్ 

Related posts

ఆదిలాబాద్ పర్యాటక రంగ అభివృద్ధి పై దృష్టిసారించండి…

Satyam NEWS

గుడ్ వర్క్: కరోనా వ్యాపించ కుండా ముందస్తు జాగ్రత్తలు

Satyam NEWS

ఆఫ్టర్ కరోనా: కార్పొరేట్ కాలేజీలు మూతపడటం ఖాయం

Satyam NEWS

Leave a Comment