కడప జిల్లా రాజంపేట మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద కరోనా వ్యాపించ కుండా ముందస్తుగా జాగ్రతలు చేపట్టారు. దేశాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్న నేపధ్యంలో రెవెన్యూ అధికారులు కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆఫీస్ సిబ్బంది తో సహా ప్రతి ఒక్కరూ బయట నీళ్లతో కాళ్ళు,చేతులు సబ్బుతో కడుక్కోని వచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు.
ఇందుకోసం నీళ్లు,సబ్బు, హ్యాండ్ వాష్ షాంపూ కార్యాలయం బయట పెట్టారు. తప్పని సరి ఈ పద్దతి పాటించాలని తాసిల్దార్ రవిశంకర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. దీనితో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు,అధికారులు చేతులు శుభ్ర పరుచుకొని కార్యాలయంలో కి వస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లు,ముందస్తు జాగ్రత్తలు అన్ని ప్రభుత్వ, ప్రవేటు కార్యాలయాల్లో ,వ్యాపార సముదాలయాల్లో ఏర్పాటు చేస్తే కరోనా ను పూర్తిగా అరికట్టేందుకు మార్గం సుగమం అవుతుందని పలువురు భావిస్తున్నారు.