30.2 C
Hyderabad
May 13, 2024 12: 37 PM
Slider ఆదిలాబాద్

అమ్మా….నిన్ను కష్టపెట్టిన ఈ ‘బంగారు తెలంగాణ’ను క్షమించు తల్లీ….

#manchiryal dist

పురిటి నొప్పులు… అసలే వైద్య సౌకర్యం అందుకోలేని పేదరికం… ఆపై వాగులు, వంకలు అడ్డం… ఏం చేయాలి? ఒక తల్లి పురిటి నొప్పులతో పడ్డ ఇబ్బంది అంతా ఇంతా కాదు. భగవంతుడు దయతలిచాడు కాబట్టి సరిపోయింది కానీ…. లేకపోతే……???

ఇదీ బంగారు తెలంగాణ లోని ఒక గర్భిణి స్త్రీ ప్రసవవేదన. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామానికి చెందిన మానిపెళ్ళి సుభద్ర కు నెన్నెల మండలం కోనంపేట గ్రామానికి చెందిన వ్యక్తికి కొద్ది కాలం కిందట వివాహం జరిగింది. సుభద్ర గర్భవతి కావడంతో ప్రసవం చేసుకోవడానికి తల్లిగారి ఇంటికి వచ్చింది.

శుక్రవారం ఉదయం పురిటి నొప్పులు మొదలుకాగా వెంటనే 108కి కాల్ చేశారు. గ్రామానికి వెళ్ళేదారి మధ్యలో ఉన్న వాగు భారీ వర్షానికి ఉప్పొంగటంతో వాహనం వాగు దాటలేని పరిస్థితి. దాంతో ఆమె వస్తున్న వాహనాన్ని వాగు వద్దే నిలిపి వేశారు. అతి కష్టం మీద ప్రయివేట్ వాహనం సహాయంతో వాగు వద్దకు చేరుకున్న గర్భిణీ వాగు దాటలేక వాగు అవతలి ఒడ్డు వద్దే ఉండిపోయింది. సమయం మించిపోతుండటం, ప్రసవ వేదన తీవ్రం అవుతుందటంతో 108 సిబ్బంది జల మహేశ్, ఫరీద్ అహ్మద్, గ్రామస్తులు ముందుకు వచ్చి ఆ గర్భిణీ ని వాగు దాటించారు.

108 సిబ్బంది అంబులెన్స్ లోని స్టేచ్చర్ ను తీసుకోని అతి కష్టం మీద వాగు దాటి ఆ గర్భిణీని అంబులెన్స్ ఎక్కించి కోటపల్లి PHC కి తరలించే ప్రయత్నం చేశారు. గర్భిణీ ని ఆసుపత్రికి తీసుకువస్తుండగా పురిటి నొప్పులు తీవ్రం కాగా మధ్య లోనే అంబులెన్స్ ను నిలిపివేసి 108 EMT వాళ్ళ ఉన్నత అధికారులకు సమాచారం అందించారు.

వారి సూచనల మేరకు ప్రసవం జరిపించగా ఆ మహిళ బాబు కి జన్మనిచ్చింది. అక్కడి నుండి తల్లిబిడ్డ ఇద్దరినీ కోటపల్లి PHC కి తరలించారు. అత్యవసర సమయంలో సకాలంలో స్పందించిన 108 సిబ్బంది, గ్రామస్తులకు మహిళ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

నక్కలపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో సుమారుగా 6 వరకు గ్రామాలు ఉండగా ఇప్పటివరకు ఈ గ్రామానికి సరైన రహదారి లేదు. కోటపల్లి మండలంలోని బ్రాహ్మణపల్లి నక్కలపల్లి,బద్దంపల్లి, చామనపల్లి, బొమ్మెన గ్రామాలు ఉండగా ఈ మార్గంలో సరైన రోడ్డు, బ్రిడ్జిలు లేక ప్రతి సంవత్సరం ఈ మార్గంలోనే గ్రామ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు, వాగుల పై న బ్రిడ్జి నిర్మాణాలపై పై దృష్టి పెట్టాలని మారుమూల గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Related posts

పైడిత‌ల్లి అమ్మ‌వారి పండుగ ఏర్పాట్ల‌ను ప‌రిశీలించిన జేసీ కిషోర్‌

Satyam NEWS

వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే శారీరకంగా దృఢంగా ఉండాలి

Satyam NEWS

చకచకా సాగుతున్న అయోధ్య రామమందిర నిర్మాణం

Satyam NEWS

Leave a Comment