27.7 C
Hyderabad
May 4, 2024 08: 22 AM
Slider శ్రీకాకుళం

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న జాతీయ స్థాయి క్రీడాకారిణి

#weight lifter

శ్రీకాకుళం జిల్లా గార మండలానికి చెందిన దూబ హైమశ్రీ 40 కేజీల సబ్ జూనియర్ వ్యక్తిగత విభాగంలో పంజాబ్ లోని పాటియాలా జరగనున్న జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీకి ఎంపిక అయింది. 107 కేజీల బరువును  పైకి ఎత్తి అర్హత పోటీల్లో హైమశ్రీ ప్రథమ స్థానం కైవసం చేసుకుంది.

ఈనెల ఆగస్టు 9 నుంచి 13వ తేదీ వరకు జాతీయ స్థాయి పోటీలు జరగనున్నాయి. అయితే హైమశ్రీని ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయి.

ఆమె తల్లిదండ్రులు పేదరికంతో ఉన్నారు. దాతలు ఎవరైనా ముందుకొచ్చి తనకు ఆర్థిక సహాయం అంద  చేయవలసిందిగా ఈ సందర్భంగా ఆమె కోరుతున్నది.

అసమాన ప్రతిభను ప్రదర్శిస్తున్న హైమశ్రీ ని అందరూ ఆదుకోవాలని శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అప్పన్న, పెద్దపాడు ఉన్నత పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్. గుండాల మోహన్ కోరారు.

ఎవరైనా సహాయం చేయదలిస్తే ఈ క్రింది ఫోన్ పే నెంబర్ కు పంపించవలసినదిగా ఆమె కోరుతున్నది. ఫోన్ పే నెంబరు 9121631983.

తనకు కోచింగ్, ఆర్థిక సహాయం ఇచ్చిన పెద్దపాడు గ్రామానికి చెందిన వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అప్పన్నకు హైమశ్రీ  ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

Related posts

కాషాయం ధరించని కర్మ యోగి ఆయన

Satyam NEWS

పేదల కాలనీలు పట్టించుకోని బాగ్ అంబర్ పేట్ కార్పొరేటర్

Satyam NEWS

విజయనగరం జిల్లాకు రెండు స్కాచ్ అవార్డులు

Satyam NEWS

Leave a Comment