40.2 C
Hyderabad
April 29, 2024 17: 00 PM
Slider ప్రత్యేకం

త్రిబుల్ ఆర్ : మరో వివాదంలో ఏపి పోలీసు ఉన్నతాధికారులు?

#RRR

9000911111 ఈ సెల్ నెంబర్ ఎవరితో తెలుసా? చాలా మందికి తెలియకపోవచ్చు. ఈ నెంబర్ త్రిబుల్ ఆర్ ది. త్రిబుల్ ఆర్ అంటే రఘురామకృష్ణంరాజు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు అయిన కె. రఘురామకృష్ణంరాజు ను మే 14న ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి ఆయనపై దేశ ద్రోహం కేసు పెట్టిన విషయం తెలిసిందే.

పుట్టిన రోజునాడు ఆయనను అరెస్టు చేసి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని మంగళగిరికి తీసుకువెళ్లి అక్కడ పోలీసు లాకప్ లో ఉంచారు. పోలీసు లాకప్ లో ఏం జరిగిందో ఇప్పటికే రఘురామకృష్ణంరాజు సుప్రీకోర్టుకు చెప్పారు.

సుప్రీంకోర్టు ఆయనకు సికింద్రాబాద్ లోని ఆర్మీ ఆసుప్రతిలో వైద్య పరీక్షలు చేయించింది. ఈ సందర్భంగా ఆయన కాలు వేలుకు ఫ్రాక్చర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించి అదే విషయాన్ని సుప్రీంకోర్టు కు చెప్పడంతో సుప్రీంకోర్టు దీన్ని సీరియస్ గా తీసుకుని ఆయనకు తక్షణమే బెయిల్ మంజూరు చేసింది. ఆ నాటి నుంచి ఆయన ఇంకా కోలుకోలేదు.

తనకు లాకప్ లో జరిగిన విషయాన్ని, సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో తనకు వ్యతిరేకంగా జరిగిన కుట్రను రఘురామకృష్ణంరాజు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పుడు తాజాగా మరో అంశం ఆయన దృష్టికి వచ్చింది.

రఘురామకృష్ణంరాజుకు రెండు సెల్ ఫోన్లు ఉన్నాయి. పైన చెప్పిన నెంబర్ ఒకటి కాగా రెండో నెంబర్ కూడా ఉంది. ఏపి సిఐడి పోలీసులు ఒక నెంబర్ ను అధికారికంగా సీజ్ చేశారు. రెండో నెంబర్ ను అధికారికంగా సీజ్ చేయలేదు. అయితే దాన్ని కూడా వారి వద్దనే ఉంచుకున్నారు. పార్లమెంటు సభ్యుడిగా తనకు సంబంధించిన ఎంతో కీలక సమాచారం తన ఫోన్ లలో ఉందని రఘురామకృష్ణంరాజు అంటున్నారు.

లాకప్ లో తనను చిత్రహింసలు పెట్టి తన ఫోన్ పాస్ వర్డ్ లను పోలీసులు తెలుసుకున్నారని రఘురామకృష్ణంరాజు చెబుతున్నారు. తన ఫోన్ లలో ఉన్న కీలక సమాచారాన్ని పోలీసులు తీసేసుకున్నారని ఆయన అంటున్నారు.

అధికారికంగా ఒకే ఫోన్ ను సీజ్ చేసిన పోలీసులు అనధికారికంగా తమ వద్ద ఉంచుకున్న రెండో ఫోన్ ను కూడా తక్షణమే కోర్టు ద్వారా తనకు ఇవ్వాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని చెబుతూ రఘురామకృష్ణంరాజు ఏపి సిఐడి పోలీసులకు నేడు లీగల్ నోటీసు జారీ చేశారు.

తనను చిత్ర హింసలు పెట్టి తన ఫోన్ పాస్ వర్డ్ తీసుకున్న పోలీసులు పార్లమెంటు సభ్యుడిగా తన నియోజకవర్గానికి సంబంధించిన సమాచారాన్ని, పార్లమెంటు సభ్యుడిగా తాను సభ్యుడిగా ఉన్న పలు పార్లమెంటు కమిటీల సమాచారం కూడా పోలీసులు తీసుకున్నారని రఘురామకృష్ణంరాజు అంటున్నారు.

ఇది ఇలా ఉండగా పోలీసులు అధికారికంగా సీజ్ చేసిన నెంబర్ ను కూడా దుర్వినియోగం చేస్తున్నట్లు మరో ఫిర్యాదు కూడా రఘురామకృష్ణంరాజు చేస్తున్నారు. పోలీసులు అధికారికంగా సీజ్ చేసిన ఫోన్ నెంబర్ నుంచి కొందరికి తన పేరుతో మెసేజీలు పంపుతున్నారనేది రఘురామకృష్ణంరాజు వద్ద ఉన్న సమాచారం.

సీనియర్ ఐ ఏ ఎస్ (రిటైర్డ్) పి వి రమేష్ కు ఇదే విధంగా ఒక మెసేజి వెళ్లింది. తన కాల్ లిస్టులో లేని నెంబర్ నుంచి తనకు మెసేజి రావడంతో పి వి రమేష్ ఆ నెంబర్ ఎవరిదని వాకబు చేశారు. ఆ నెంబర్ రఘురామకృష్ణంరాజు దిగా తేలడంతో ఆయన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. రఘురామకృష్ణంరాజు ఈ విషయంలో స్పందించాలని ఆయన ట్విట్టర్ లో కోరారు.

సీజ్ చేసిన తన ఫోన్ నుంచి పోలీసులు మెసేజీలు పంపుతున్నారనే విషయం రఘురామకృష్ణంరాజుకు అర్ధం అయింది. దాంతో ఆయన ఈ విషయంపై మరో ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. తన పేరు పై ఉన్న సెల్ నెంబర్ నుంచి మెసేజీలు పంపి తనను మరో కేసులో ఇరికించేందుకు ఏపి పోలీసులు ప్రయత్నిస్తున్నారని రఘురామకృష్ణంరాజు భావిస్తున్నారు.

అయితే పోలీసులు సీజ్ చేసిన ఫోన్ నుంచే మెసేజీలు వెళుతుండటంతో ఏపి సిఐడి పోలీసులు ఇప్పుడు కొత్త చిక్కులు ఎదుర్కొనబోతున్నారనడంలో సందేహం లేదు. అధికారికంగా సీజ్ చేసిన ఫోన్ ఒక పోలీసు ఉన్నతాధికారి వద్దే ఉన్నట్లు, దాని నుంచే మెసేజీలు వెళుతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే సదరు పోలీసు ఉన్నతాధికారి కుడితిలో పడినట్లేనని భావిస్తున్నారు.

Related posts

బండరెంజల్ గ్రామంలో పర్యటించిన మండల పరిషత్ అధికారి

Satyam NEWS

తెలంగాణ చ‌రిత్ర‌లో అతిపెద్ద విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డులు

Satyam NEWS

కాంగ్రెస్ పాలన లో అభివృద్ధి కుంటుపడుతోంది

Satyam NEWS

Leave a Comment