28.7 C
Hyderabad
May 6, 2024 09: 43 AM
Slider కవి ప్రపంచం

స్థితప్రఙ్ఞుడు

#PV Narasimharao 1

ఎవరు చెప్పారు

అంతర్గత మానవ చైతన్యానికి

దీప్తిగా వెలిగే

మహా చైతన్యం అతని సొంతమని

ఎవరు చెప్పారు

చిన్ననాటి జ్ఞాపకాల్ని మరువని

మహా మనిషని ఎవరు చెప్పారు

మహాభాషలన్నీ భాష్యంగా

ఓ వ్యక్తి వైపు వేలు పెట్టి చూపిస్తూ

మహా ప్రపంచాలు మహా భాషా ఙ్ఞానాలు

పాదాక్రాంత మవుతుంటే

అతడొక నిశ్చలమైన స్థితప్రజ్ఞుడి వలె

అలా నడిచి పోతుంటే ……..

వెనక మ్రొక్కులన్నీ తృణప్రాయమతనికి

మేరు శిఖరమై నడచిన కాలాల

పాదముద్రలన్నీ ఓ అనిర్వచనీయమైన

ఙ్ఞాపకాలే దేశానికి

శాంతి దూత కూతురు

నీవే కావాలంటూ పిలిచిన పిలుపులకు సంతోషాన్ని అనేక దుఃఖాల్ని దిగమింగిన మహా ఆత్మ

అతని సొంత మైంది

స్నేహాల్ని మరువని ఓ జీవన విధానం

అతన్ని నడిపించింది

కాళోజీని ప్రేమించినా

విశ్వనాధుని అభిమానించినా

అతని కలం కురిపించిందంతా

కవితా ధారలే

విపక్షాలైనా స్వపక్షమైనా

చిరునవ్వు చిందిస్తూ

కాలపు  వొడ్డు  మీద నడవ గలిగిన

వాడెవ్వడు

ఆ మహా మనీషే పివి.

కె.హరనాథ్ 9703542598

Related posts

లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి దేవాలయం ముఖ్యసలహాదారు ఆకస్మికమరణం

Satyam NEWS

యుద్ధోన్మాద పుతిన్ అధికారంలో కొనసాగేందుకు వీలులేదు

Satyam NEWS

ఎలర్ట్: కరోనాపై అన్ని జిల్లాలలో అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment