34.7 C
Hyderabad
May 5, 2024 01: 56 AM
Slider ప్రపంచం

మళ్లీ క్షిపణి ప్రయోగం: పెట్రేగిపోయిన ఉత్తర కొరియా

#northkoria

ఉత్తర కొరియా శుక్రవారం తూర్పు సముద్రంలోకి మరో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. రెండు రోజుల్లో ప్యాంగ్యాంగ్ నుంచి క్షిపణిని ప్రయోగించడం ఇది రెండోసారి. ఉత్తర కొరియా ఇటీవలి రోజుల్లో అణు పరీక్షల భయాలను పెంచుతూ రికార్డు స్థాయిలో ప్రయోగాలను కొనసాగిస్తోందని సియోల్ పేర్కొంది. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ క్షిపణి ప్రయోగాన్ని ధృవీకరించారు. అయితే క్షిపణి రకం లేదా పరిధి ఎంత ఉంటుందనే విషయాలను నిర్ధారించలేదు.

దక్షిణ కొరియా, అమెరికా తూర్పు సముద్రంలో సైనిక విన్యాసాలు నిర్వహించడంతో ఉత్తర కొరియా ఇటీవల వందలాది ఫిరంగి షెల్స్‌ను సముద్రంలోకి కాల్చింది. వాటిలో కొన్ని జపాన్ భూ భాగంలో, సముద్ర జలాల్లో కూడా పడ్డాయి. అమెరికా దాని మిత్రదేశాలతో కలిసి, ఈ ప్రాంతంలో తన ఉనికిని పెంచడానికి ప్రయత్నిస్తోందని అందుకే “కఠినమైన సైనిక ప్రతిస్పందన” వ్యక్తం చేస్తున్నామని ఉత్తరకొరియా ప్రకటించింది. అమెరికా ‘రిస్క్ తీసుకుంటుందంటే పశ్చాత్తాపపడుతుంది’ అని ఉత్తర కొరియా స్పష్టం చేసింది.

ఐరాస భద్రతా మండలి క్షిపణి ప్రయోగాలను నిషేధించింది. ఉత్తరకొరియా క్షిపణి మరియు అణ్వాయుధ కార్యక్రమాలు నిషేధించబడ్డాయి. ఇటీవల అమెరికా-దక్షిణ కొరియా-జపాన్ మధ్య కుదిరిన శిఖరాగ్ర ఒప్పందం కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచుతుందని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి చోయ్ సన్ హ్యూ గురువారం అంతకుముందు హెచ్చరించారు.

Related posts

వృద్ధులకు పెద్ద కొడుకు కేసీఆర్‌

Murali Krishna

బాబాయి హత్య కేసులో జగన్ మేనమామ కు సీబీఐ విచారణ

Satyam NEWS

రైతులకు, ప్రజలకు నష్టం జరిగితే నహించను

Bhavani

Leave a Comment