28.7 C
Hyderabad
May 5, 2024 23: 04 PM
Slider ముఖ్యంశాలు

ఇక రైలు టికెట్‌ను బదిలీ చేయొచ్చు

#railways

భారత రైల్వే ప్రయాణికులకు కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైలు టికెట్ ను మరొకరికి బదిలీ చేసే అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఒక్కోసారి తప్పనిసరి పరిస్థితుల్లో మనం రైలు ప్రయాణం రద్దు చేసుకోవాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు డబ్బులు కోల్పోవాల్సి రావచ్చు. కానీ అలా జరగకుండా ఉండేందుకు రైల్వే శాఖ ఓ సదుపాయం కల్పిస్తోంది. మన టికెట్‌ను మన సమీప కుటుంబ సభ్యుల పేరు మీదకు బదిలీ చేయొచ్చు. తండ్రి, తల్లి, సోదరి, సోదరుడు, కూతురు, కొడుకు, భర్త, భార్య వీరికి మాత్రమే టికెట్‌ను బదిలీ చేసేందుకు వీలుంటుంది.

ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలంటే కనీసం 24 గంటల ముందు రైల్వే శాఖకు అర్జీ పెట్టుకోవాలి. టికెట్‌ కన్ఫర్మ్‌ అయినవారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. ఈ సదుపాయాన్ని ఒక్కసారి మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలుంది. అంటే ఒకసారి బదిలీ చేసిన టికెట్‌ మరోసారి వేరే వాళ్ల పేరు మీదకు మార్చలేం. ఎవరైతే బదిలీ చేసుకున్న టికెట్‌ ద్వారా ప్రయాణిస్తారో వారు తప్పనిసరిగా ముందు టికెట్‌ బుక్‌ చేసుకున్నవారి గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాలి.

Related posts

సమగ్ర శిక్షా క్యాలెండర్ ను విడుదల చేసిన ధర్మాన

Satyam NEWS

ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ కి చక్రధర్ సిద్దాంతి

Satyam NEWS

ఇన్ స్పెక్షన్: ప్రజలు బాగానే సహకరిస్తున్నారు

Satyam NEWS

Leave a Comment