28.7 C
Hyderabad
May 6, 2024 09: 06 AM
Slider ఆదిలాబాద్

సింగరేణి ఏరియా హాస్పిటల్ ముందు నర్సుల ధర్నా

#Singareni hospital

రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ నర్సులు వార్డ్ బాయ్స్ ఆయాల కరోణ ఇన్సెంటివ్ వారి సమస్యల గురించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మధ్యల శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి  ఏరియా హాస్పిటల్లో కరోణ వార్డులో ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు తొమ్మిది నెలల నుండి కరొణ ఇన్సెంటివ్లు సీఎం పిఎఫ్ బాండ్స్ చిట్టీలు ఇవ్వకుండా కాలయాపన చేస్తూ మభ్య పెడుతున్నారని,సమయానికి వేతనాలు,డ్యూటీ డ్రెస్సులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాకు రావాల్సిన హక్కుల గురించి ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చినప్పటికీ యాజమాన్యం దృష్టికి సమస్యను తీసుకొని వెళ్ళిన పట్టించుకోవటం లేదని అన్నారు.

కాంట్రాక్ట్ కార్మికులు లేకపోతే సింగరేణికి లాభాలు మనుగడలేదని అధికారులకు వేతనాలు లేవని వీరుఅతి తక్కువ జీతాలతో జీవనం వెళ్లదీస్తున్నారు అదే పర్మినెంట్ ఎంప్లాయ్ కి మొదటి తారీకు జీతాలు పడుతున్నాయని వారితో సమానంగా పని చేస్తున్నా కాంట్రాక్ట్ కార్మికులకు మాత్రం నెల చివరిలో వేతనాలు అవి కూడా సమయానికి ఇవ్వకపోవడంతో అప్పుల బాధలు పడుతూ ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు.

స్టాఫ్ నర్సులను సివిల్ వర్కర్లుగా కాకుండా పారామెడికల్ కింద తీసుకొని వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.హాస్పిటల్ లో ఉన్న అవకతవకలను కరోణ ఇన్సెంటివ్లను 15 లోపు ఇవ్వని పక్షంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సమ్మెకు దిగుతామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఇంచార్జ్ జావేద్, నూకరాజు నాగరాజు,పవన్ కళ్యాణ్,హెప్సిబా ప్రశాంతి,శారదా,స్వప్న,విజయలక్ష్మి,సరిత తదితరులు పాల్గొన్నారు

Related posts

రద్దయిన పెద్దనోట్ల డంప్ ను పట్టుకున్న పోలీసులు

Satyam NEWS

శ్రీ ఆది వరాహ లక్ష్మీ నరసింహ వేణుగోపాల స్వామి వారికి రధం

Satyam NEWS

కొత్త సంవత్సరం నుంచి ఏపిలో పాపులర్ బ్రాండ్ మద్యం

Satyam NEWS

Leave a Comment