24.7 C
Hyderabad
May 13, 2024 03: 56 AM
Slider ఖమ్మం

నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ ముమ్మరం చేయండి

#khammam police

నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ మరింత ముమ్మరం చేయాలని పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ పోలీస్ అధికారులకు ఆదేశించారు. గురువారం  ఖమ్మం టూ టౌన్ ,ఖానాపురం హావేలి పోలీస్ స్టేషన్లు, ఖమ్మం టౌన్ ఏసీపీ కార్యాలయాన్ని  పోలీస్ కమిషనర్ సందర్శించి తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ నేరం జరిగిన తర్వాత స్పందించే కంటే ముందస్తు నేర నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పాత నేరగాళ్లపై నిఘా ఉంచటంతోపాటు క్రిమినల్ గ్యాంగ్ ల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులతో మర్యాదగా మెలగాలని, ప్రతిఒక్కరికి జవాబుదారీగా వుండాలని సూచించారు.రిసెప్షన్ సిబ్బంది  విధులు ఏవిధంగా నిర్వర్తిస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు. రిసెప్షన్ రికార్డులను తనిఖీ చేశారు.  పోలీస్ స్టేషన్ లో నిర్వహిస్తున్న  ఫంక్షనల్  వర్టీకల్స్ సమీక్షించారు. 5s అమలులో భాగంగా పోలీస్ స్టేషన్లలో స్టేషనరీ విభాగం పరిశుభ్రంగా వుంచాలని అదేవిధంగా అవసరమైన రికార్డులు, వస్తువులను క్రమపద్ధతిలో పెట్టడం పరిసరాలలో సురక్షితమైన ,ఆరోగ్యవంత మైన వాతావరణాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు.

అప్పగించిన భాద్యతలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు.  స్టేషన్ హౌస్ మేనేజ్‌మెంట్, పోలీస్ స్టేషన్ నిర్వహణ, యూనిఫాం మరియు హెల్మెట్ ధరించడం, రెగ్యులర్ రోల్ కాల్ మరియు వీక్లీ పరేడ్ గురించి సిబ్బంది అధికారులు విధిగా అమలు చేయాలని  పేర్కొన్నారు.

అనంతరం పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించారు. పెట్రో కార్ సిబ్బంది ఏవిధమైన విధులు నిర్వహిస్తున్నారు? బీట్ డ్యూటీ సిబ్బంది  ట్యాబ్ ద్వారా క్రైమ్ ప్రొ ఏరియాను ఏవిధంగా గుర్తిస్తున్నారు? జియో ట్యాగ్‌ ద్వారా  పాత నేరస్ధుల నివాసాలను కదలికలను ఏవిధంగా  గుర్తిస్తున్నారో ట్యాబ్ ద్వారా చూపించాలని ఆదేశించారు.

స్టేషన్ ఆవరణను పరిశీలించి పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ ను, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. కమ్యూనిటీ పోలిసింగ్ లో భాగంగా  సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం ద్వారా కలిగే ఉపయోగాలను స్ధానికులు వివరించి స్వచ్ఛందంగా సీసీ కెమెరాలు పెట్టుకొనే విధంగా అవగాహన కల్పించాలని సూచించారు.

Related posts

సామాజిక బస్సు యాత్రలో చంపిన వాళ్ళ గూర్చి కూడా చెప్తారా?

Satyam NEWS

తిరుపతి వెంకన్న ను దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్

Satyam NEWS

ఎకరాకు రూ. 20 వేలు పరిహారం ఇవ్వాలి

Murali Krishna

Leave a Comment