27.7 C
Hyderabad
May 7, 2024 10: 03 AM
Slider మహబూబ్ నగర్

పోలింగ్ స్టేషన్లపై అభ్యంతరాలకు రేపటి వరకూ గడువు

kollapur mch

మున్సిపల్ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే  8వ తేదీ వరకు తెలియజేయాలని కొల్లాపూర్ మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య వివిధ రాజకీయ పార్టీలకు నాయకులకు తెలిపారు. మంగళవారం స్థానిక  మున్సిపల్ కార్యాలయ ఆవరణలో రాజకీయ నాయకులతో కమిషనర్ వెంకటయ్య  సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ఆయన ఎన్నికలకు సంబంధించిన అంశాలపై మాట్లాడారు. మున్సిపల్ పరిధిలో మొత్తం 20వార్డ్స్ కు  19478 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. అదేవిధంగా ఎన్నికలు నిర్వహించే పోలింగ్  స్టేషన్ల దగ్గర రెండు బూత్ లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వార్డులోని మొత్తం కెళ్లి 50శాతం ఓటర్లు 2 పోలింగ్ బూత్ లలో  ఓటింగ్ నిర్వహించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

నామినేషన్లకు సంబంధించిన అంశాలను వివరించారు. సరైన  డాక్యుమెంట్స్ ను జత పరచి నామినేషన్ వేయాల్సిన విధానాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు రాజశేఖర్, భగవాన్, మల్లేష్ టిఆర్ఎస్ పార్టీ నాయకులు కాటమ్ జంబులయ్య, చంద్ర శేఖర చారి, మేకల నాగరాజు, బోరెల్లి మహేష్ , నాయిమ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ముఖ్యమంత్రి కార్యాలయంపై ముసురుకున్న మరో వివాదం

Satyam NEWS

అంగరంగ వైభవంగా జేడ్పీ చైర్మన్ బిడ్డ..నిశ్చితార్థం..

Satyam NEWS

ఎడ్యుగ్రామ్ @ టెలిగ్రామ్ ద్వారా ఐఐటీ, నీట్ ప్రిపరేషన్

Satyam NEWS

Leave a Comment