39.2 C
Hyderabad
May 4, 2024 19: 38 PM
Slider పశ్చిమగోదావరి

ఆయిల్ పామ్ సాగుపై రైతులతో అధికారుల ముచ్చట

#oil palm

ఆయిల్ పామ్ సాగు, ఉత్పత్తి సాంకేతిక పద్ధతుల పై, భారతీయ ఆయిల్ పామ్ పరిశోధనా సంస్థ లో శిక్షణ పొందుతున్న అస్సాం, త్రిపుర, తెలంగాణ, కేరళ, ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ కి చెందిన 34 అధికారులు, శిక్షణ లో భాగంగా ఏలూరు జిల్లా దెందులూరు మండలం చల్లచింతలపూడి గ్రామ ఆయిల్ పామ్ సాగు రైతులతో ముఖా ముఖి చర్చల్లో పాల్గొన్నారు.

ఆయిల్ పామ్, సాగు లో మెలకువలను, మొక్కలు నాటటం, ఎరువుల వినియోగం తో బాటు మొదటి మూడు సంవత్సరాల్లో తీసుకోవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు పంట సాగులో పాటించవలసిన ఆధునిక వ్యవసాయ పద్ధతుల ను చల్ల చింతలపూడి రైతులను అడిగి తెలుసుకున్నారు. సాగులో ఖర్చు, నికరాదాయం వంటి విషయాలు చర్చించారు.

సాగులో మొదటి మూడు సంవత్సరాల్లో వేసే అంతర పంటలు, తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎదిగిన తోటల్లో పండిoచ తగ్గ పంటల గురించి రైతులతో జరిగిన ముఖాముఖి గా జరిగిన చర్చా గోష్ఠి లో రైతులు S. సత్యనారాయణ, ప్రదీప్, గంగాధరరావు, సుబ్రహ్మణ్యం, వెంకటేశ్వరావు పాల్గొన్నారు.

Related posts

నిత్యావసర వస్తువుల షాపులకు వెసులుబాటు

Satyam NEWS

హోట‌ళ్లు, రెస్టారెంట్ల‌కు రోజంతా అనుమ‌తి

Satyam NEWS

హరిత పట్టణంగా నిర్మ‌ల్ అభివృద్ధికి కృషి

Satyam NEWS

Leave a Comment