37.2 C
Hyderabad
May 2, 2024 12: 41 PM
Slider విజయనగరం

సీఎం జగన్ పర్యటనకు 2000 మంది తో పట్టిష్టమైన భద్రత…!

#depika

డీపీఓ లో పోలీసు సిబ్బంది తో సమీక్ష నిర్వహించిన పోలీసు బాస్

విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెద మేడపల్లి గ్రామం వద్ద  నూతనంగా నిర్మించనున్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేసేందుకు రాష్ట్ర సీఎం జగన్, కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పర్యటించనున్న నేపథ్యంలో సుమారు 2,000మందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ ముఖ్యమంత్రి భద్రత దృష్ట్యా అన్ని భద్రతా చర్యలు చేపట్టామన్నారు. బందోబస్తును వివిధ కేటగిరిలుగా విభజించి, భద్రత ఏర్పాట్లు చేసామని, ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్క పోలీసు ఉన్నతాధికారిని బాధ్యులుగా నియమించామన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. హెలి ప్యాడ్, పార్కింగు, కాన్వాయ్, సభా స్థలం, శిలా ఫలకం, రూట్ బందోబస్తు, ట్రాఫిక్ రెగ్యులేషన్, ట్రాఫిక్ డైవర్షన్స్ విధులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా అధికారులు, సిబ్బందిని నియమించామన్నారు. బందోబస్తు విధులు నిర్వహించే అధికారులు, సిబ్బందికి వారు నిర్వహించాల్సిన విధులు గురించి ఇప్పటికే జిల్లా ఎస్పీ సంపూర్ణ అవగాహన కల్పించి, దిశా నిర్దేశం చేసామన్నారు. అంతేకాకుండా, వాహనాల రాక, పోకలకు ఎటువంటి విఘాతం ఏర్పడకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ చేపట్టేందుకు ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని నియమించామన్నారు. ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనే ముఖ్య వ్యక్తుల వాహనాలకు, కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసే ప్రజల వాహనాలకు వేరు వేరుగా పార్కింగు చేసుకొనే విధంగా పార్కింగు స్థలాలు ఏర్పాటు చేసామన్నారు.

ముఖ్యమంత్రి పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని భద్రతా చర్యలు చేపట్టామని, బందోబస్తు నిమిత్తం ముగ్గురు అదనపు ఎస్పీలు, 11 మంది డిఎస్పీలతో సహా సుమారు 2000మందిని వినియోస్తున్నామని జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ పలుసార్లు ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లును ఇతర పోలీసు అధికారులతో సమీక్షించారు. జిల్లా ఎస్పీ వెంట అదనపు ఎస్పీ అస్మా ఫర్హీన్, అల్లూరి సీతారామ రాజు జిల్లా అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, విజయనగరం డిఎస్పీ ఆర్.గోవిందరావు, బొబ్బిలి డిఎస్పీ పి.శ్రీధర్, చీపురుపల్లి డిఎస్పీ ఎ.ఎస్.చక్రవర్తి, ట్రాఫిక్ డిఎస్పీ డి. విశ్వనాధ్, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ యూనివర్స్, ఎస్బీ సిఐలు కే.కే.వి. విజయనాద్, ఈ. నర్సింహమూర్తి, గజపతినగరం సిఐ ఎల్.అప్పల నాయుడు, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Related posts

చిరుకాంక్ష

Satyam NEWS

కొల్లాపూర్ పురోహితుడికి వైదిక ధర్మాచారణ విభూషణ రత్న

Satyam NEWS

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న పన్నాల

Satyam NEWS

Leave a Comment